Pushpa Update : సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది..

‘పుష్ప’ సెకండ్ సాంగ్ అప్‌డేట్ ఇవ్వబోతున్నామంటూ లొకేషన్ పిక్ షేర్ చేసింది టీం..

Pushpa Update : సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది..

Pushpa The Rise

Pushpa Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయిక.. పాపులర్ మలయాళం యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు..

Love Story : పవన్‌ను ప్రశంసిస్తూ మహేష్ ట్వీట్.. రిప్లై ఇచ్చిన రెహమాన్..

రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘పుష్ప – ది రైజ్’ ను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాండమిక్ తర్వాత షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రీసెంట్‌గా లొకేషన్ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్.

Pushpa : ‘పుష్ప’ కోసం ఎవరు ఎంతెంత తీసుకుంటున్నారంటే!..

ఇటీవల ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘దాక్కో దాక్కో దాక్కో మేక’ రిలీజ్ చెయ్యగా సాలిడ్ రెస్పాన్స్‌తో పాటు రికార్డ్ స్థాయి వ్యూస్ వచ్చాయి. దీంతో ఆడియన్స్, ఫ్యాన్స్ సెకండ్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ అడుగుతుండగా.. త్వరలోనే సెకండ్ సింగిల్ విడుదల చెయ్యబోతున్నాం అంటూ ఈ లొకేషన్ పిక్ షేర్ చెయ్యగా వైరల్‌గా మారింది.