This Week Movies : వామ్మో.. ఏందిది.. ఒక్కరోజే థియేటర్స్ లో పది సినిమాలు రిలీజ్.. ఈ వారం సినిమాలు ఇవే..

అసలు ఇందులో సగం సినిమాలు ఉన్నాయని కూడా జనాలకు తెలుసో లేదో. (This Week Movies)

  • Published on- September 30, 2026 / 01:11 PM IST

This Week Movies

This Week Movies : ఇటీవల వరుసగా సినిమాలు రిలీజయి మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఆరతి వారం రెండు, మూడు సినిమాలు ఉండటం మాములే. కానీ ఈ వారం ఏకంగా పది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అసలు ఇందులో సగం సినిమాలు ఉన్నాయని కూడా జనాలకు తెలుసో లేదో.

మలయాళం స్టార్ నివిన్ పౌలి, తమిళ్ నటుడు సూరి కలిసి నటిస్తున్న సినిమా తెలుగులో సంచారి పేరుతో అక్టోబర్ 1న రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల సూరి మండాడి, నివిన్ పౌలీ బెత్లెహాం కుటుంబ యూనిట్ సినిమాలు తెలుగులో ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేసారు. అవి ఇక్కడ మంచి కలెక్షన్స్ తెచ్చుకున్నాయి. కానీ సంచారి సినిమాకు మినిమమ్ ప్రమోషన్ కూడా లేదు. మలయాళం సినిమాని తెలుగు డబ్బింగ్ తో డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు.

ఇక మిగిలిన సినిమాలు అన్ని అక్టోబర్ 2న రాబోతున్నాయి. ఆది సాయి కుమార్ ఇటీవలే శంబాలా తో మంచి హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. కానీ ఆయన దగ్గర్నుంచి వస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ సినిమాకు అసలు మినిమమ్ ప్రమోషన్ లేదు. ఈ సినిమా అక్టోబర్ 2న వస్తుందని ఎవరికీ తెలీదు. కనీసం ఈ సినిమా హీరో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. కానీ సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ సినిమా మాత్రం రిలీజ్ అవుతుంది.

Also Read : Thellakaagitham : గుర్తింపు కోసం చీప్ పబ్లిసిటీ.. రొమాంటిక్ సీన్ లీక్ చేసి..

సందీప్ కిషన్ హీరోగా తమిళనాడు సీఎం విజయ్ కొడుకు డెబ్యూట్ డైరెక్టర్ గా సిగ్మా అనే సినిమా తీశారు. ఈ సినిమాపై అయితే కాస్త బజ్ ఉంది. ఈ సినిమా తమిళ్ తెలుగులో ఒకేసారి అక్టోబర్ 2 రిలీజ్ అవుతుంది.

ఫహద్ ఫాజిల్ హీరోగా రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాతగా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే సినిమా అక్టోబర్ 2 వస్తుంది. అసలు ఈ సినిమాకు ఎలాంటి బజ్ లేదు కానీ నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ రావడంతో ఒక్కసారిగా సినిమాకు హైప్ వచ్చింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలీదు కానీ ఎన్టీఆర్ చెప్పినందుకు అయినా ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా చూస్తారేమో చూడాలి.

దినేష్ తేజ్, దశ్విక జంటగా తత్త్వం అనే థ్రిల్లర్ సినిమా కూడా అక్టోబర్ 2 రిలీజ్ అవుతుంది. ఈ సినిమా పై అంచనాలు లేకపోయినా ట్రైలర్ అయితే బాగుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Also Read : Demon Pavan-Rithu Chowdary : ఆమె న‌న్ను బ్లాక్ చేసింది.. తెగిపోయిన బిగ్‌బాస్ బంధం.. డిమాన్ ప‌వ‌న్ ఎమోష‌న‌ల్ పోస్ట్

కోర్ట్ ఫేమ్ హర్ష రోషన్, కొత్త అమ్మాయి నక్షత్ర జంటగా తెల కాగితం అనే సినిమా చేసారు. ఇంటర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2 రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సాంగ్స్ వైరల్ అయినా పెద్దగా బజ్ రాలేదు. అందుకే మూవీ యూనిట్ బజ్ కోసం స్వయంగా హీరో – హీరోయిన్ రొమాంటిక్ సీన్ లీక్ చేసి విమర్శలు తెచ్చుకుంది.

కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో LGBTQ బ్యాక్ డ్రాప్ పై వచ్చిన తమిళ్ సినిమా డోరతీ అక్కడ వివాదాలపాలయి ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతుంది. మరి తెలుగులో ఈ సినిమాని ఎవరైనా పట్టించుకుంటరా చూడాలి. సినిమాకు ప్రమోషన్స్ అయితే లేవు.

సంధ్య, విక్రమ్ సాహిదేవ్ జంటగా డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన నిర్మాతగా తెరకెక్కిన అనకాపల్లి సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ లాస్ట్ మూమెంట్ లో కేవలం అనకాపల్లిలో మాత్రమే రిలీజ్ చేసి మిగతా అన్ని చోట్ల రిలీజ్ ఆపేసారు. అది అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది. అప్పట్లో ప్రమోషన్స్ బాగానే చేసారు కానీ ఇప్పుడు సింపుల్ గా రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో అయితే ఈ సినిమాకు మంచి టాక్ వినిపిస్తుంది.

Also Read : Rohit-Trigun Bigg Boss Today: రోహిత్ వ‌ర్సెస్ త్రిగుణ్‌.. డాగ‌ర్స్ కోసం రెండు టీమ్స్ గ‌ట్టి పోరాటం.. న‌రేష్ కామెడీ అదుర్స్‌..

కన్నడలో సూపర్ హిట్ అయినా ప్రేమనే ఊరిలో సినిమా తెలుగులో అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాపై అసలు బజ్ లేదు.

ఇక హిందీ సినిమా అజయ్ దేవగన్ దృశ్యం ది కన్క్లూజన్ కూడా అక్టోబర్ 2న విడుదల అవుతుంది. తెలుగులో రిలీజ్ అవ్వకపోయినా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వారం దాదాపు పది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని సినిమాల్లో ఒక్కటి అయినా జనాలకు కనెక్ట్ అయి హిట్ అవుతుందా చూడాలి.