This Week Movies : ఈ వారం థియేటర్స్ లో రిలీజయ్యే సినిమాలు ఇవే..
థియేటర్స్ లో సమ్మర్ సినిమాల సీజన్ మొదలైంది. ఏప్రిల్ చివరి వారంలో తక్కువ సినిమాలే ఉన్నా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తున్నాయి.
- Saketh U
- Published On : April 25, 2023 / 09:21 AM IST
This Week theatrical releasing Movies
This Week Movies : సమ్మర్(Summer) మొదలైంది. సమ్మర్ తో పాటు థియేటర్స్(Theaters) లో సమ్మర్ సినిమాల సీజన్ కూడా మొదలైంది. ఏప్రిల్(April) చివరి వారంలో తక్కువ సినిమాలే ఉన్నా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తున్నాయి.
మన తెలుగులో అక్కినేని అఖిల్(Akkineni Akhil), సాక్షి వైద్య(Sakshi Vaidya) జంటగా సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏజెంట్(Agent) ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మొదటి సారి అఖిల్ పూర్తిగా మాస్, యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ ఏజెంట్ సినిమాపై అఖిల్ చాలా అంచనాలు పెట్టుకున్నాడు.
ఇక తమిళ్ నుంచి మణిరత్నం(ManiRatnam) దర్శకత్వంలో విక్రమ్(Vikram), కార్తీ(Karthi), జయం రవి(Jayam Ravi), ఐశ్వర్య రాయ్(Aishwarya Rai), త్రిష(Trisha), శోభిత, ఐశ్వర్య లక్ష్మి, జయరాం.. ఇలా అనేకమంది స్టార్ కాస్ట్ తో భారీగా తెరకెక్కించిన సినిమా పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) పార్ట్ 2 రాబోతుంది. గత సంవత్సరం వచ్చిన పొన్నియిన్ సెల్వన్1 తమిళ్ లో హిట్ అయినా మిగిలిన భాషల్లో యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు పార్ట్ 2 ని కూడా ఏప్రిల్ 28న పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కాబోతుంది.
ఇక హిందీలో బ్యాడ్ బాయ్ అనే సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతుంది. ఒకప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. హైదరాబాదీ అమ్మాయి అమ్రిన్ ఖురేషి ఇందులో హీరోయిన్ గా నటించింది.
Lavanya Tripathi : అనాథాశ్రమంలో లావణ్య త్రిపాఠి..
వీటితో పాటు తెలుగులో రారా పెనిమిటి, హిందీలో సిసు అనే సినిమాలు రాబోతున్నాయి. ఇక వీటిల్లో ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. మరి ఈ వారం ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందో చూడాలి.
