Thrigun : వామ్మో.. త్రిగుణ్ ఏంటి ఇలా మారిపోయాడు.. రా & రస్టిక్ లుక్‌లో..
లవ్, కామెడీ సినిమాలతో ఇన్నాళ్లు అలరించిన హీరో త్రిగుణ్ ఇప్పుడు రా & రస్టిక్ లుక్ లోకి మారిపోయాడు. (Thrigun)
- Saketh U
- Published on- June 8, 2026 / 09:34 PM IST
Thrigun
Thrigun : లవ్, కామెడీ సినిమాలతో ఇన్నాళ్లు అలరించిన హీరో త్రిగుణ్ ఇప్పుడు రా & రస్టిక్ లుక్ లోకి మారిపోయాడు. నేడు త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమాని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మాణంలో కెవిన్ గడ్డం(శ్రీహరి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జంగా’.
Also Read : Bollywood : టాలీవుడ్ మీద జెలస్ ఫీల్ అవుతున్న బాలీవుడ్..? పెద్ది విషయంలో..
త్రిగుణ్, నేహా పఠాన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ,సమీర్, నాగ మహేష్,భూపాల్, రఘు కారుమంచి, రచ్చ రవి.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు త్రిగుణ్ బర్త్ డే సందర్భంగా జంగా నుంచి మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇంత వరకు లవర్ బాయ్‌లా కనిపించిన త్రిగుణ్ ఈ సారి రా అండ్ రస్టిక్ లుక్‌లో మాసీగా కనిపిస్తున్నారు. కెరీర్‌లోనే డిఫరెంట్ సినిమాని చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
