Krishna Shroff: స్టార్ హీరో కూతురే కానీ టాప్ లెస్ ఫోజులు!

తండ్రి స్టార్ హీరో.. ఒకనాడు అమ్మాయిల కళల రాకుమారుడు కూడా. అన్నయ్య కూడా ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరోలలో స్టార్ స్టేటస్ అందుకుంటున్న హీరో. అయితేనేం బికినీ వేయకూడదా.. టాప్ లెస్ ఫోజులు ఇవ్వకూడదా అన్నట్లుంది కృష్ణ ష్రాఫ్ యవ్వారం.

Krishna Shroff

Krishna Shroff: తండ్రి స్టార్ హీరో.. ఒకనాడు అమ్మాయిల కళల రాకుమారుడు కూడా. అన్నయ్య కూడా ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరోలలో స్టార్ స్టేటస్ అందుకుంటున్న హీరో. అయితేనేం బికినీ వేయకూడదా.. టాప్ లెస్ ఫోజులు ఇవ్వకూడదా అన్నట్లుంది కృష్ణ ష్రాఫ్ యవ్వారం. ఒకవైపు తండ్రి జాకీ ష్రాఫ్ ఇంకా ఫీల్డ్ లో ఉండగానే కొడుకు టైగర్ ష్రాఫ్ సిక్స్ ప్యాక్ హీరోగా అదరగొడుతున్నాడు. ఇక ఇప్పుడు కూతురు కృష్ణ ష్రాఫ్ కూడా ఇండస్ట్రీ మీద ఎక్కుపెట్టింది.


సహజం మన టాలీవుడ్ తో పోలిస్తే బాలీవుడ్ వార‌సురాళ్ళ‌కు కాస్త ధైర్యం ఎక్కువ. పైగా ఇక్కడ కొడుకైనా.. కూతురైనా ఇండస్ట్రీలో ఒక్కటే. స్టార్ హీరోల వారసులు కదా కాస్త అభిమానులు నొచ్చుకుంటారేమో అనుకుంటే అసలు నడవదు ఇక్కడ. అందుకే స్టార్ డాటర్స్ కూడా స్కర్ట్స్ లేకపోతే బయటకి రారు.. బికినీ లేకపోతె ఫోటో షూట్ ఇవ్వరు. ఇంకా పూర్తిస్థాయిలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ కూడా కాలేదు కాని కృష్ణష్రాఫ్ ఇప్పుడే టాప్ లెస్ ఫోజులు ఇచ్చేసింది.


ఓ ఫోటోషూట్ కోసం ఏకంగా అర్ధనగ్నంగా టాప్ లెస్ ఫోజులు ఇచ్చిన కృష్ణ ఆ ఫోటోలు తెచ్చి సోషల్ మీడియా ద్వారా పోస్టు చేస్తోంది. ఓ స్టార్ హీరోకు కూతురైనా ఇలా అర్ధనగ్నంగా మ్యాగజైన్ కోసం పోజులివ్వడం ఇప్పుడు బీటౌన్ ప్రేక్షకులను కలవరపెడుతుంది. సహజంగానే ఈ భామ చేసే ర‌చ్చ‌కు సోషల్ మీడియా కూడా షేక్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు బికినీ ఫోటోల‌తో పిచ్చెక్కిస్తుంటుంది. అస‌లు ఈ భామ దూకుడు చూస్తుంటే బాపురే.. అస‌లు ఏం అడ్డు లేకుండా ఎలా రెచ్చిపోతుందిలా అనిపిస్తుంది. మరి ఒకటో రెండో వెండితెర మీద బొమ్మ పడితే ఇంక ఆ లెక్కే వేరుగా ఉంటుందేమో!