Cauliflower : ఆమిర్ ఖాన్ తర్వాత సంపూనే.. టైటిల్ జస్టిఫికేషన్ అంట..
‘ఆమిర్ తర్వాత ఇలా కనిపించే డేర్ చేసింది సంపూనే’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు..
- sekhar
- Updated on- July 3, 2021 / 05:36 PM IST
Title Justification Poster Of Burning Star Sampoornesh Babu Cauliflower
Cauliflower: ‘కొబ్బరిమట్ట’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకోవడమే కాక, ఫస్ట్ మూవీతో మంచి విజయం సాధించిన తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం వన్ బై వన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సంపూ నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ట్యాగ్‌లైన్.
Bazaar Rowdy : ఆ పిల్ల ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబు మతి చెడగొట్టిందంట..
ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, బ్యాంగ్ వీడియో ఆకట్టుకున్నాయి. ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లీష్‌మ్యాన్‌గా సంపూ కనిపించబోతున్నాడు. షూటింగ్ కంప్లీట్ అయిందని చెప్తూ.. సంపూ లార్డ్ కృష్ణ అవతారంలో ఉన్న లుక్ వదలగా కామెడీగా అనిపించినా క్యూట్‌గా కనిపించాడు.
ఇక్కడివరకు బాగానే ఉంది కానీ శనివారం ‘టైటిల్ జస్టిఫికేషన్’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం పిచ్చ పీక్స్‌లో ఉంది. అసెంబ్లీ ఎదుట ఒంటిపై గాయాలతో, నూలుపోగులేకుండా, మీడియా ముందు ‘క్యాలీఫ్లవర్’ అడ్డు పెట్టుకుని నిలబడి ఉన్న సంపూ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఈ పోస్టర్ బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ‘పీకే’ మూవీ పోస్టర్‌ను గుర్తుకుతెస్తుంది. ఆమిర్ తర్వాత ఇలా కనిపించే డేర్ చేసింది సంపూనే’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Cauliflower : బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు ‘క్యాలీఫ్లవర్’..!
సంపూర్ణేష్‌బాబు పక్కన వాసంతి హీరోయిన్గా నటించగా.. గుడూరు శ్రీధర్సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్పతాకాలపై ఆశ జ్యోతి గోగినేని నిర్మించిన ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యబోతున్నారు.
