Cauliflower : బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు ‘క్యాలీఫ్లవర్‌’..!

బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు నటిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘క్యాలీఫ్లవర్‌’..

Cauliflower : బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు ‘క్యాలీఫ్లవర్‌’..!

Sampoornesh Babu Cauliflower Movie Shoot Completed

Updated On : June 25, 2021 / 3:22 PM IST

Cauliflower: ‘కొబ్బరిమట్ట’ సినిమాతో ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకోవడమే కాక, ఫస్ట్ మూవీతో మంచి విజయం సాధించిన తర్వాత బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు నటిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘క్యాలీఫ్లవర్‌’. ‘‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ట్యాగ్‌లైన్‌.

ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. సంపూర్ణేష్‌బాబు బర్త్‌ డే సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, బ్యాంగ్‌ వీడియోకు మంచి స్పందన‌ లభించింది. ఇంగ్లాండ్‌ నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లీష్‌మ్యాన్‌గా సంపూ కనిపించనున్నారు.

Cauliflower

 

‘క్యాలీఫ్లవర్‌’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది. షూటింగ్‌ పూర్తయిన విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమాలోని సంపూర్ణేష్‌ బాబు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్‌. లార్డ్‌ కృష్ణ అవతారంలో సంపూ లుక్‌ ఆకట్టుకునేలా ఉంది.

సంపూర్ణేష్‌ బాబు పక్కన వాసంతి హీరోయిన్‌గా నటిస్తున్నారు. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్‌ పతాకాలపై ఆశ జ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. గోపీకిరణ్‌ కథ అందించగా.. ముజీర్‌ మాలిక్‌ సినిమాటోగ్రఫీ, ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతమందిస్తున్నారు.