Bazaar Rowdy : ఆ పిల్ల ‘బ‌ర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబు మతి చెడగొట్టిందంట..

నీ వంటికి మోరుపులు బాగా చుట్టేశావే.. నా కంటికి ఏవో రంగులు చూపించావే.. పిల్లా నా మ‌తి చెడ‌గోట్టావే.. వ‌ద్ద‌న్నా న‌ను ప‌డ‌గోట్టావే’.. అంటూ సంపూర్ణేష్ బాబు, హీరోయిన్ మ‌హేశ్వ‌రి వ‌ద్దితో డ్యూయెట్ పాడుకుంటున్నాడు..

Bazaar Rowdy : ఆ పిల్ల ‘బ‌ర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబు మతి చెడగొట్టిందంట..

Sampoornesh Babu Bazaar Rowdy Movie 2nd Song Released

Bazaar Rowdy: వరుస విజ‌యాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సందడి చేస్తున్న ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబు హీరోగా కె.ఎస్. క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా ‘బజార్ రౌడి’. రీసెంట్‌గా ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ విడుద‌ల చేశారు. ‘నీ వంటికి మోరుపులు బాగా చుట్టేశావే.. నా కంటికి ఏవో రంగులు చూపించావే.. పిల్లా నా మ‌తి చెడ‌గోట్టావే.. వ‌ద్ద‌న్నా న‌ను ప‌డ‌గోట్టావే’.. అంటూ సంపూర్ణేష్ బాబు, హీరోయిన్ మ‌హేశ్వ‌రి వ‌ద్దితో డ్యూయెట్ పాడుకుంటున్నాడు. ఈ సాంగ్‌కి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్యేకమైన స్పంద‌న వ‌స్తుంది. ప్ర‌స్తుతం పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

Bazaar Rowdy

ద‌ర్శ‌కుడు డి.వసంత నాగేశ్వరరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. శేఖర్ అలవలపాటి నిర్మాణ సారథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావ‌డం విశేషం. సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్‌లో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Bazaar Rowdy

సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాశారు. ఎడిటర్ గౌతంరాజు ‘బజార్ రౌడి’ చిత్రాన్ని చాలా బాగా కుదించారు. SS ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. క‌రోనా తీవ్ర‌త త‌గ్గిన వెంట‌నే ‘బ‌జార్‌ రౌడి’ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Bazaar Rowdy

న‌టీ న‌టులు..
బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు, మ‌హేశ్వరి వద్ది, నాగినీడు, షియాజి షిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి, క‌త్తిమ‌హేష్, త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు..
ద‌ర్శ‌కుడు: వసంత నాగేశ్వ‌రావు
నిర్మాత‌: సందిరెడ్డి శ్రీనివాస‌రావు
మాట‌లు: మ‌రుధూరి రాజా
సినిమాటోగ్రఫర్: ఏ విజ‌య్ కుమార్‌
సంగీతం: సాయి కార్తిక్‌
ఎడిటర్: గౌతం రాజు
ఫైట్ మాస్ట‌ర్‌: జాషువా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి
కో-డైర‌క్ట‌ర్‌: కె. శ్రీనివాస‌రావు..