Tollywood Actress : ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..? వైరల్ అవుతున్న ఫోటోలు..
కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..?
- gum 95921
- Published On : December 7, 2023 / 12:30 PM IST
Tollywood Actress Shriya Kontham photos gone viral in social media
Tollywood Actress : సినిమా పరిశ్రమలో అలా ఒక మెరుపు మెరిసి మళ్ళీ కనిపించకుండా మాయమై పోతుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం బాగా పెరగడంతో ఆడియన్స్ కి కనిపిస్తూనే ఉంటున్నారు. తాజాగా ఒక అమ్మాయి ఫోటో నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా తయారైంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఏదొక సినిమా ఎంపిక చేసుకోమని సలహాలు కూడా ఇస్తున్నారు. ఇంతకీ పై ఫొటోలో ఉన్న అమ్మాయిని మీరు గుర్తు పట్టారా..?
నేచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ సినిమాలో నానితో పాటు మొత్తం ఐదు జనరేషన్స్ కి సంబంధించిన అమ్మాయిలు ప్రధాన పాత్రల్లో నటించారు. వారిలో టీనేజ్ అమ్మాయిగా నానికి సిస్టర్ లాంటి పాత్రలో నటించిన అమ్మాయి అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. సినిమాలో కళ్ళజోడు పెట్టుకొని నార్మల్ అమ్మాయిగా కనిపించిన ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఈమె పేరు శ్రియ కొంతం. గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత మళ్ళీ మరో సినిమాలో శ్రియ నటించలేదు.
Also read : NTR31 : ఎన్టీఆర్ సినిమా గురించి ప్రశాంత్ నీల్ కామెంట్స్.. కేజీఎఫ్, సలార్‌లా కాకుండా..
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శ్రియ అదిరే ఫోటోషూట్స్ చేస్తూ, వాటిని షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ వస్తుంది. గ్యాంగ్ లీడర్ తరువాత మరో సినిమాలో కనిపించని శ్రియ.. మూవీ ఛాన్సులు కోసం ప్రయత్నిస్తుందా..? లేదా..? అనేది తెలియదు. ప్రస్తుతం ఈ అమ్మడి కొన్ని పిక్స్ మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఆ ఫోటోలు వైపు మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
