Heroins : మళ్ళీ యాక్షన్ బాట పట్టిన హీరోయిన్స్.. తెరమీద ఉగ్ర రూపమే..
అదే ఫాలో అవుతూ మరికొంతమంది హీరోయిన్స్ యాక్షన్ బాట పట్టారు. (Heroins)
- Saketh U
- Published on- April 19, 2026 / 09:35 AM IST
Tollywood Actresses
Heroins : ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాగా వచ్చాయి. మధ్యలో కొంత గ్యాప్ వచ్చి హీరోయిన్స్ గ్లామర్ కే పరిమితమయ్యారు. అడపాదడపా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చినా అవన్నీ కథ పరంగా నడిచినవే కానీ యాక్షన్ తక్కువే. కానీ ఇప్పుడు మళ్ళీ యాక్షన్ బాట పడుతున్నారు హీరోయిన్స్. ఇటీవల సత్యభామ సినిమాతో కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా యాక్షన్ అదరగొట్టింది.
ఇప్పుడు అదే ఫాలో అవుతూ మరికొంతమంది హీరోయిన్స్ యాక్షన్ బాట పట్టారు. ఇన్నాళ్లూ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేసిన హీరోయిన్స్ ఇప్పుడు హీరోలకి మించి హీరోయిజాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నారు. వరుస సక్సెస్‌ఫుల్ సినిమాలతో సూపర్ ఫామ్ చూపిస్తోన్న రష్మిక మందన్న ఇటీవల గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో పర్వాలేదనిపించింది. ఇప్పుడు మైసా అనే పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెండ్ సినిమా చేస్తుంది. మైసా ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన రష్మిక ఈ సినిమా కోసం ప్రస్తుతం బ్యాంకాక్‌లో కష్టమైన ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇంటర్నేషనల్ యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ పర్యవేక్షణలో స్పెషల్‌గా ట్రైన్ అవుతుంది రష్మిక. ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు చాలానే ఉన్నాయట. రష్మిక తన ఉగ్రరూపం చూపించబోతుంది ఈ సినిమాతో అని అంటున్నారు.
Also Read : Bosco Martis : వారణాసి కోసం బాలీవుడ్ మాస్టర్.. అప్పుడు ఎన్టీఆర్ తో, ఇప్పుడు మహేష్ తో.. రాజమౌళి ప్లానింగ్..
రష్మిక మందన్న మాత్రమే కాదు ఆల్రెడీ యాక్షన్ బాట పట్టిన సమంత త్వరలో మా ఇంటి బంగారం సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ సిరీస్ లతో తనలోని యాక్షన్ చూపించిన సమంత ఈసారి మా ఇంటి బంగారం తో కూడా యాక్షన్ మోడ్ లో అదరగొట్టనుంది. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న మా ఇంటి బంగారం సినిమా నుంచి విడుదలైన టీజర్ లో సమంత యాక్షన్ స్టంట్స్ అందరి అటెన్షన్ గ్రాబ్ చేశాయి. స్పై ఏజెంట్ రోల్‌లో మెస్మరైజ్ యాక్షన్ చూపిస్తానంటున్న సమంత మా ఇంటి బంగారం సినిమా మే 15న ఆడియెన్స్ ముందుకు రానుంది.
రష్మిక, సమంత మాత్రమే కాదు ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్, నటన ప్రాధాన్యంగా ఉండే కీలక పాత్రలతో మెప్పించిన సంయుక్త మీనన్ కూడా యాక్షన్ బాట పట్టింది. బ్లాక్‌గోల్డ్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ చూపించబోతుంది. రీసెంట్ గా మంచిర్యాలలో 40 నుంచి 45 డిగ్రీల హాట్ వెదర్‌లో యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేయడం ఎంతో సవాల్‌గా అనిపించిందని, ఈ సినిమాలో యాక్షన్ ఓ రేంజ్‌లో ఉంటుందని పోస్ట్ చేసింది సంయుక్త. ఇలా హీరోయిన్స్ గ్లామరస్ రోల్స్ ని పక్కనపెట్టి హీరోలను మించి యాక్షన్ చూపించడానికి రెడీ అవుతున్నారు.
Also Read : Pradeep Ranganathan : పాపం.. హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోని ముంచేసిన నయనతార భర్త..
