Bosco Martis : వారణాసి కోసం బాలీవుడ్ మాస్టర్.. అప్పుడు ఎన్టీఆర్ తో, ఇప్పుడు మహేష్ తో.. రాజమౌళి ప్లానింగ్..
ఈ సినిమాలో ఓ సాంగ్ కూడా ఉందని, అందులో డ్యాన్స్ కూడా ఉందని ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. (Bosco Martis)
Bosco Martis
Bosco Martis : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు – ప్రియాంక చోప్రా జంటగా వారణాసి సినిమా భారీగా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ తోనే భారీ అంచనాలు నెలకొల్పింది. పాన్ వరల్డ్ ప్రాజెక్టు గా ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
అయితే ఈ సినిమాలో ఓ సాంగ్ కూడా ఉందని, అందులో డ్యాన్స్ కూడా ఉందని ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తాజాగా ఆ డ్యాన్స్ సాంగ్ ని షూట్ చేస్తున్నారట. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేయడానికి బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ని తీసుకొచ్చారట రాజమౌళి. తన కాంపౌండ్ లో ఎప్పుడూ ఉండే మాస్టర్స్, RRR కి ఆస్కార్ తెచ్చే రేంజ్ లో నాటు నాటు ఇచ్చిన ప్రేమ్ రక్షిత్ ని వదిలేసి వారణాసి కోసం రాజమౌళి బాస్కో మార్టిస్ ని తీసుకు రావడం గమనార్హం.
Also Read : Pradeep Ranganathan : పాపం.. హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోని ముంచేసిన నయనతార భర్త..
గతంలో బాస్కో మార్టిస్ తెలుగులో వియ్యాలవారి కయ్యలు, ఆరెంజ్, శ్రీమంతుడు, ధ్రువ, దేవర సినిమాలకు పనిచేసాడు. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఒక్కదానికే సింగిల్ గా కొరియోగ్రఫీ చేసాడు బాస్కో మార్టిస్. మిగిలిన తెలుగు సినిమాలకు తన తోటి డ్యాన్స్ మాస్టర్ సీజర్ గోన్స్లేవ్స్ తో కలిసి పనిచేసాడు. దేవర సమయంలో ఎన్టీఆర్ గురించి ఇతను పెట్టిన పోస్ట్, ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ గురించి బాస్కో మార్టిస్ మాట్లాడిన మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.
ఇప్పుడు ఎన్టీఆర్ తర్వాత మహేష్ బాబు కోసం బాస్కో మార్టిస్ వారాణసి సినిమాకు పనిచేయబోతున్నాడు. మరి ఈ సినిమాలో మహేష్ తో ఎలాంటి స్టెప్స్ వేయిస్తారో చూడాలి. ఇక వారణాసి సినిమా ఈ సాంగ్ షూట్ అవ్వగానే నెల రోజుల పాటు సమ్మర్ హాలిడేస్ తీసుకోనుంది. మే తర్వాత జూన్ నుంచి మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఆగస్టు కల్లా వారణాసి షూటింగ్ పూర్తిచేయాలని రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నారు.
Also Read : Ruhani Sharma : బాబోయ్ రఫ్ఫాడించే లుక్స్ లో రుహాణి శర్మ.. ఫొటోలు..
