×
Ad

Heroine : తల్లిని అవమానించిన రిలేటివ్స్.. కసితో ఏకంగా బెంజ్ కార్ కొన్న హీరోయిన్..

తాజాగా ఓ హీరోయిన్ తమ తల్లికి జరిగిన అవమానం గురించి చెప్తూ దానికి ఏం చేసిందో చెప్పుకొచ్చింది. (Heroine)

Heroine

Heroine : ఎవరైనా సక్సెస్ రాకముందు అవమానాలు ఎదుర్కుంటారు. ఇక సినీ పరిశ్రమలో అయితే సక్సెస్ రాకపోతే ఎవరూ పట్టించుకోరు. తాజాగా ఓ హీరోయిన్ తమ తల్లికి జరిగిన అవమానం గురించి చెప్తూ దానికి ఏం చేసిందో చెప్పుకొచ్చింది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మన సీత.. మృణాల్ ఠాకూర్. హిందీలో సీరియల్స్ తో మొదలుపెట్టిన మృణాల్ మరాఠీ, బాలీవుడ్ సినిమాలో నటించి సీతారామం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో ఇక్కడ స్టార్ డం తెచ్చుకొని ఫ్యాన్ ఫాలోయింగ్, సినిమా ఆఫర్స్ తెచ్చుకుంది. మృణాల్ చివరగా తెలుగులో ఫ్యామిలీ స్టార్ సినిమాతో కనిపించింది. త్వరలో డెకాయిట్ సినిమా తో రాబోతుంది.

Also Read : Priyanka Chopra : రాజమౌళి కొడుకుతో ప్రియాంక చోప్రా డ్యాన్స్.. వీడియో వైరల్..

తాజాగా మృణాల్ బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సంఘటన గురించి చెప్పింది. మృణాల్ మాట్లాడుతూ.. మాది ఆర్థికంగా మిడిల్ క్లాస్ కంటే తక్కువ కుటుంబం కావడంతో ఒక సందర్భంలో మా బంధువులు వాళ్ళ కార్ లో మా అమ్మను కుర్చోపెట్టుకోడానికి నిరాకరించారు. ఆ అవమానం నాకు చాలా బాధ కలిగించింది. ఆ రోజే నేను మా అమ్మకు ఖరీదైన కార్ కొంటానని మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకొని బెంజ్ కార్ కొన్నాను. మా ఫ్యామిలీ, రిలేటివ్స్ లో అంత ఖరీదైన కార్, బెంజ్ కార్ నాదే మొదటిది అని తెలిపింది.

మృణాల్ దగ్గర దాదాపు 2 కోట్ల విలువ గల లగ్జరీ బెంజ్ కార్ ఉంది. సినిమాల్లో సక్సెస్ అయ్యాక మృణాల్ ఈ కార్ కొంది. ఈ విషయం ఇప్పుడు ఇలా చెప్పడంతో మృణాల్ ని అంతా అభినందిస్తున్నారు.

Also See : Kushitha Kallapu : చీరకట్టులో యువతను కలవరపెడుతున్న కుషిత.. ఫోటోలు వైరల్..