జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 2020.. ఓటేసిన సినీ ప్రముఖులు..

  • Published By: sekhar ,Published On : December 1, 2020 / 12:03 PM IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 2020.. ఓటేసిన సినీ ప్రముఖులు..

Updated On : December 1, 2020 / 12:04 PM IST

Tollywood Celebrities – GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జూబ్లీక్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ ఓటు వేశారు.

Chiranjeevi

 

అక్కినేని నాగార్జున, అమల దంపతులు, కేటీఆర్ దంపతులు, తనికెళ్ల భరణి, పరుచూరి గోపాలకృష్ణ దంపతులు, విజయ్ దేవరకొండ తదితరులు కుటుంబ సమేతంగా ఓటు వేశారు. మంచు లక్ష్మీ, దర్శకులు తేజ, క్రిష్, శివాజీ రాజా, ఆయన తనయుడు విజయ్ రాజా, నిర్మాతలు శ్యాం ప్రసాద్ రెడ్డి, ఉషా ముల్పూరి (నాగశౌర్య తల్లి), ప్రజాకవి గద్దర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Image

సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నగరంలో 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 9,101 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. కరోనా దృష్ట్యా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

Image

ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ప్రతిపోలింగ్ బూత్ లో శానిటైజర్ ఏర్పాటు చేశారు. కరోనా పేషెంట్ లు కూడా ఓటు హక్కు వినియోగంచుకునేలా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అయితే పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కు వినిగియోగించుకునే అవకాశం కల్పించారు.

Image