Rakesh Master : బ్రతికి ఉండగా ఎంతోమందికి సాయం చేసిన రాకేశ్ మాస్టర్.. చనిపోతూ కూడా మరొకరికి..

ఇండస్ట్రీకి వద్దామనుకున్న ఎంతోమందికి చేయూతను అందించన రాకేశ్ మాస్టర్.. చనిపోతూ కూడా మరొకరికి పడుతున్నారు.

tollywood coreographer Rakesh Master eyes donate on his last wish

Rakesh Master : టాలీవుడ్ కొరియోగ్రఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ జూన్ 18న మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త ఇండస్ట్రీలోని డాన్సర్స్ ని తీవ్రంగా బాధించింది. సూపర్ హిట్ సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేశ్ మాస్టర్.. ఇండస్ట్రీకి వద్దామనుకున్న ఎంతోమందికి చేయూతను అందించారు. తన ఇంటిలోనే పెట్టుకొని ఎంతోమందికి అవకాశాలు వచ్చేవరకు అన్నం పెట్టారు. అలా ఆయన దగ్గర ఉంటూ నేడు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ గా స్థానం కలిపించుకున్నారు. ప్రస్తుతం స్టార్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ (Jani Master), శేఖర్ మాస్టర్ (Sekhar) కూడా అయన దగ్గర ఉన్నవారే.

Rakesh Master : రాకేశ్ మాస్టర్ పార్థివదేహానికి శేఖర్ మాస్టర్ నివాళులు.. కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్!

ఇలా బ్రతికి ఉన్నంత కాలం ఎంతోమందికి సహాయం చేసిన రాకేశ్ మాస్టర్.. చనిపోతూ కూడా మరొకరికి సహాయ పడుతున్నారు. తన చనిపోయిన తరువాత తన కళ్ళని దానం చేయాలని రాకేశ్ మాస్టర్ అనుకున్నారు. ఆయన చివరి కోరికను గౌరవిస్తూ కుటుంబసభ్యులు ఆయన కళ్ళను దానం చేసినట్లు తెలియజేశారు. ఈ విషయం తెలియడంతో నెటిజెన్లు జోహార్ రాకేశ్ మాస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు జూన్ 19న హైదరాబాద్ బోరబండలో జరిగాయి.

Rakesh Master : ప్రభుదేవాతో రాకేశ్‌ మాస్టర్‌ గొడవ ఏంటో తెలుసా..? పబ్లిక్‌గా సవాల్ విసిరి!

కాగా రాకేశ్‌ మాస్టర్‌.. ముక్కురాజు మాస్టర్ వద్ద శిష్యరికంతో కెరీర్ ని స్టార్ట్ చేసి.. ఆట, ఢీ వంటి డ్యాన్స్‌ షోలతో కెరీర్ లో ముందుకు వెళ్లారు. ఢీ షోతో మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. అలా టాలీవుడ్ లోని పలు సూపర్ హిట్ సినిమాలకు డాన్స్ కంపోజ్ చేశారు. దాదాపు 1500 చిత్రాలకు పైగా కోరియోగ్రఫీ చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, చిరునవ్వు, అమ్మో పోలీసోళ్ళు వంటి సూపర్ హిట్ సినిమాలకు డాన్స్ కోరియోగ్రఫీ చేసి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఇక గత కొంత కాలంగా అయితే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు