NSR Prasad : టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

ఇటీవల టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు మరణించి విషాదాన్ని నింపారు. తాజాగా మరో ప్రముఖ దర్శకుడు కన్నుమూశారు. రచయిత, దర్శకుడు ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ ఇవాళ ఉదయం కన్నుమూశారు.

Tollywood Director NSR Prasad Passed away

Director NSR Prasad :  ఇటీవల టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు మరణించి విషాదాన్ని నింపారు. తాజాగా మరో ప్రముఖ దర్శకుడు కన్నుమూశారు. రచయిత, దర్శకుడు ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. తాడేపల్లిగూడెం నుంచి సినీ పరిశ్రమకు వచ్చిన ఆయన పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రైటర్ గా, ఘోస్ట్ రైటర్ గా పనిచేశారు.

సీతారామ్ ప్రసాద్.. ఆర్యన్ రాజేష్ హీరోగా రామానాయుడు నిర్మించిన “నిరీక్షణ” చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అనంతరం శ్రీకాంత్ తో శత్రువు, నవదీప్ తో నటుడు అనే సినిమాలు డైరెక్ట్ చేశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “రెక్కి” సినిమా త్వరలోనే విడుదలకు రెడీగా ఉంది. అంతలోనే ఆయన పలు అనారోగ్య సమస్యలతో మరణించారు.

Ambati Rambabu : బ్రో సినిమాలో అంబటి క్యారెక్టర్.. సినిమాపై సెటైర్స్ వేసిన మంత్రి అంబటి..

49 ఏళ్ళ వయసులోనే డైరెక్టర్ సీతారామ్ ప్రసాద్ కన్నుమూయడంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.