Venky Kudumula : కజిన్‌ని కోల్పోయా.. మీరూ ఆ తప్పు చేయకండి.. టాలీవుడ్ దర్శకుడు ఎమోషనల్ లెటర్..

టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన కజిన్ కోల్పోయాను అంటూ ఒక ఎమోషనల్ లెటర్ ని పోస్టు చేశాడు. మీరుకూడా ఆ తప్పు చేయకండి అంటూ ఆడియన్స్ ని హెచ్చరించాడు. ఇంతకీ అసలు ఏమైంది..?

Tollywood Director Venky Kudumula emotional letter and warning to people

Venky Kudumula : ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల.. రెండో సినిమా ‘బీష్మ’తో సూపర్ హిట్టుని అందుకొని టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు నితిన్ తోనే మరో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ డైరెక్టర్ తన కజిన్ కోల్పోయాను అంటూ ఒక ఎమోషనల్ లెటర్ ని పోస్టు చేశాడు. మీరుకూడా ఆ తప్పు చేయకండి అంటూ ఆడియన్స్ ని హెచ్చరించాడు. ఇంతకీ అసలు ఏమైంది..? దర్శకుడు హెచ్చరిక దేని గురించి..?

కొన్ని వారలు క్రిందట వెంకీ కుడుముల కజిన్ కి జ్వరం వచ్చిందట. అయితే జ్వరమే కదా అని అనుకోని డాక్టర్ దగ్గరకి వెళ్లలేదట. కానీ ఆ జ్వరం జిబి సిండ్రోమ్ అనే అరుదైన రోగంగా మారిందట. దీంతో కండిషన్ బాగా సీరియస్ అయ్యింది. ట్రీట్మెంట్ ఇచ్చిన ఆరోగ్యం కోలుకోక అతను మరణించాడట. ఈ విషయం తమ కుటుంబాన్ని చాలా బాధ పెడుతుంది అంటూ వెంకీ పేర్కొన్నాడు. కోవిడ్ తరువాత జ్వరం అనేది కేవలం జ్వరం మాత్రమే కాదు. మాములు జ్వరం అయినా కూడా సీరియస్ గా తీసుకోండి అంటూ చెప్పుకొచ్చాడు.

Also read : Keedaa Cola : మల్టీప్లెక్స్‌లో రూ.112లకే కీడా కోలా సినిమా.. ఎక్కడెక్కడో తెలుసా..?

అలాగే ఒంటిలో ఏదైనా అసౌకర్యంగా ఉంటే వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకోండి. అసలు అశ్రద్ధ చేయకండి. ఆ నిర్లక్ష్యం ఖరీదు మీ ప్రాణం, మీ కుటుంబం సంతోషం అవుతుంది అంటూ హెచ్చరిస్తూ ఒక ఎమోషనల్ లెటర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ కజిన్ లాస్ కి వెంకీ కుడుములకు సానుభూతుని తెలియజేస్తున్నారు. అలాగే బాధలో కూడా ఇతరాలను హెచ్చరించినందుకు అభినందిస్తున్నారు.