Tollywood directors Anil Ravipudi Rajamouli movie graph report
Anil Ravipudi : టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి విజయయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు పరాజయం అనేది లేకుండా ముందుకు వెళ్తున్నాడు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైన రాజమౌళి ప్రయాణం.. RRR వరకు పండెండు సినిమాలు తీయగా ప్రతిదీ విజయం సాధించింది. ఇక రాజమౌళి మాదిరి మరో టాలీవుడ్ దర్శకుడు కూడా పరాజయం అనేది లేకుండా ముందుకు వెళ్తున్నాడు. రైటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి.. కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన డైరెక్టర్ ‘అనిల్ రావిపూడి’.
ఇప్పటి వరకు ఏడు సినిమాలు తీయగా ఏడు సూపర్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. ఈ మూవీ అదిరిపోయే కలెక్షన్స్ ని అందుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. రాజమౌళికి, అనిల్ రావిపూడికి మధ్య ఉన్న కామన్ పాయింట్ తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వడమే కాదు, మరో కనెక్షన్ కూడా ఉంది. భగవంత్ కేసరి మూవీ రీసెంట్ గా 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన సంగతి అందరికి తెలిసిందే.
Also read : Sai Rajesh : బేబీ మూవీ డైరెక్టర్.. ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవాడో తెలిస్తే.. నవ్వకుండా ఉండలేరు..
అనిల్ రావిపూడి గత మూడు సినిమాలు F2, F3, సరిలేరు నీకెవ్వరు సినిమాలు కూడా 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాయి. రాజమౌళి తరువాత వరుసగా నాలుగుసార్లు 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన దర్శకుడు అనిల్ రావిపూడే. దీంతో ఈ దర్శకుడు పేరు టాలీవుడ్ తో పాటు ఇతర పరిశ్రమలో కూడా వినిపిస్తుంది. భగవంత్ కేసరితో విజయం అందుకున్న ఈ దర్శకుడు తరువాత మూవీని ఎవరితో ప్లాన్ చేస్తున్నాడా..? అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.