Kiran Abbavaram: దర్శకుడిగా కిరణ్ అబ్బవరం.. అంచనాలు పెంచుతున్న స్టార్స్ కాంబో

దర్శకుడిగా సినిమా ప్లాన్ చేస్తున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram).

Tollywood hero Kiran Abbavaram is planning his debut film as a director.

  • మల్టీ టాలెంటెడ్ యాక్టర్ గా కిరణ్ అబ్బవరం
  • దర్శకుడిగా క్రేజీ మూవీ చేస్తున్న కిరణ్
  • అరవింద్ స్వామి, రాజ్ బి. శెట్టిలతో నెక్స్ట్ లెవల్ మూవీ ప్లాన్

Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్నారు. క, కే రాంప్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలను అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు తన కెరీర్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. అందులో భాగంగానే, కేవలం నటుడిగా మాత్రమే కాకుండా తనలోని మరోకోణాన్ని కూడా ఆడియన్స్ ను పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే, నిర్మాతగా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా చేస్తున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు దర్శకుడిగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. గతంలో తన ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ సినిమాకు కథ, దర్శకత్వం శాఖలు చూసుకున్న కిరణ్(Kiran Abbavaram), ఇప్పుడు పూర్తిస్థాయిలో తన సొంత కథతో దర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌ను మే నెల నుండి సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.

Anushka Shetty: ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్న అనుష్క.. వరుడు ఎవరంటే? వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్

ఈ సినిమాలో కీలక పాత్రల కోసం సౌత్ స్టార్ యాక్టర్ అరవింద్ స్వామి, కన్నడ వెర్సటైల్ నటుడు రాజ్ బి. శెట్టిలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ కుదిరితే కిరణ్ దర్శకత్వ అరంగేట్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఇక కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శకుడు సాయి రాజేష్ కథ అందిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో కూడా హీరోగా నటిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. నిర్మాతగా కిరణ్ అబ్బవరం చేస్తున్న పీరియాడిక్ విలేజ్ డ్రామా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఏప్రిల్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధమైంది. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి వి. మునిరాజు దర్శకత్వం వహించారు. ఇలా ఒకవైపు తన నటనతో, మరోవైపు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలతో కిరణ్ అబ్బవరం టాలీవుడ్‌లో బిజీయెస్ట్ హీరోగా మారిపోయారు.