Nithiin : హిట్ కోసం మళ్ళీ అదే దర్శకుడినే నమ్ముకుంటున్న నితిన్..

భీష్మ తరువాత సరైన హిట్టు లేని నితిన్.. ఒక మంచి కమ్‌బ్యాక్ కోసం మళ్ళీ అదే దర్శకుడినే నమ్ముకుంటున్నారా.

Tollywood Hero Nithiin is ready to tie up again with that hit director

Nithiin : టాలీవుడ్ హీరో నితిన్ అప్పుడెప్పుడో 2020లో ‘భీష్మ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత ఐదు సినిమాలను తీసుకు వచ్చారు. కానీ ఒకటి విజయం అందించలేకపోయింది. వీటిలో ఒక చిత్రం మాత్రమే యావరేజ్ గా ఆడింది. మిగిలిన నాలుగు సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. చివరిగా కామెడీ పంచుతా అంటూ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ గా ఆడియన్స్ ముందుకు వచ్చారు. కానీ వర్క్ అవుట్ అవ్వలేదు.

ప్రస్తుతం బీష్మ దర్శకుడితో ‘రాబిన్ హుడ్’, వేణుశ్రీరాంతో ‘తమ్ముడు’ సినిమాలను చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే ఒక మంచి హిట్ కోసం నితిన్ తన రీ బర్త్ ఇచ్చిన దర్శకుడు దగ్గరకి వెళ్లినట్లు తెలుస్తుంది. గతంలో ఏడేళ్లు ఒక్క హిట్టు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో.. దర్శకుడు విక్రమ్ కె కుమార్ ‘ఇష్క్’తో సూపర్ హిట్టుని ఇచ్చారు.

Also read : Ananya Nagalla : తిరుమల శ్రీవారి నడక దారిలో టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్

ఆ హిట్టుతో నితిన్ కెరీర్ మళ్ళీ ట్రాక్ ఎక్కింది. ఆ తరువాత వరుస హిట్స్ చూసారు. భీష్మకి ముందు కూడా నితిన్ ప్లాప్స్ లోనే ఉన్నారు. కానీ భీష్మ తరువాత పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఇష్క్ మూవీకి ముందు ఉన్న నితిన్ కెరీర్ ని గుర్తు చేస్తున్నాయి. దీంతో మళ్ళీ ఒక మంచి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం మళ్ళీ విక్రమ్ నే నమ్ముకుంటున్నట్లు తెలుస్తుంది. విక్రమ్ తో సినిమా చేయడం కోసం నితిన్ సిద్దమవుతున్నారట.

కాగా విక్రమ్ ఇటీవలే నాగచైతన్యతో ‘దూత’ వంటి వెబ్ సిరీస్ తో సూపర్ హిట్టుని అందుకున్నారు. ఇప్పుడు ఆ సిరీస్ సెకండ్ సీజన్ ని కూడా తెరకెక్కించే పనిలో ఉన్నట్లు సమాచారం. మరి ఈ సమయంలో విక్రమ్, నితిన్ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో చూడాలి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజంగానే సెట్ అయితే.. ఇష్క్‌లా లవ్ స్టోరీతోనే వస్తారా..? లేదా విక్రమ్ స్టైల్ లో డిఫరెంట్ జోనర్ తో వస్తారా..? అనేది చూడాలి.

ట్రెండింగ్ వార్తలు