Ram Charan Birthday : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు

టాలీవుడ్ హీరో, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బుధవారం తెల్లవారుజామున సతీమణి ఉపాసన, కుమార్తె క్లింకారతో కలిసి సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు.

Ramcharan in Tirumala : తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరో, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దర్శించుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా బుధవారం తెల్లవారుజామున సతీమణి ఉపాసన, కుమార్తె క్లింకార తో కలిసి సుప్రభాత సేవలో స్వామివారిని వారు దర్శించుకున్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వద్దకు భారీగా తరలివచ్చిన మెగా అభిమానులు చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీపడ్డారు.

Also Read : Ram Charan Birthday : ‘రామ్ చరణ్’ బర్త్‌డే స్పెషల్.. మెగాస్టార్ కొడుకు నుంచి గ్లోబల్ స్టార్‌గా ‘చిరుత’ ప్రయాణం..

మంగళవారం సాయంత్రమే రామ్ చరణ్ దంపతులు కుమార్తెతో కలిసి తిరుమల చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్నారు. రామ్ చరణ్ తిరుపతి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు తిరుమల ఆలయం వద్దకు భారీగా తరలివచ్చారు. ఇదిలాఉంటే ఇవాళ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించేందుకు అభిమానులు సిద్ధమయ్యారు.

 

ఇదిలాఉంటే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి, చరణ్ తల్లి సురేఖ ఓ భారీ గిఫ్ట్ ఇచ్చారు. చరణ్ బర్త్ డే సందర్భంగా అత్తామ్మాస్ కిచెన్ సంస్థ తరపున 500 మందికి అన్నదానం చేశారు. అపోలో లోని ఆలయంలో భక్తులకు సురేఖ స్వయంగా అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమానికి చిన్నజియ్యర్ స్వామి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను అత్తమ్మాస్ కిచెన్ ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

ట్రెండింగ్ వార్తలు