Ileana D’Cruz : ఎట్టకేలకు తన భర్తని చూపించిన ఇలియానా.. అతడేనట..
పెళ్లి మాట చెప్పకుండానే ప్రెగ్నెన్సీ సంగతి చెప్పి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చన ఇలియానా ఎట్టకేలకు తన భర్తని చూపించారు.
- gum 95921
- Published On : November 25, 2023 / 11:41 AM IST
Tollywood Heroine Ileana DCruz introduce her husband finally
Ileana D’Cruz : ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా పెళ్లి మాట చెప్పకుండానే ప్రెగ్నెన్సీ సంగతి చెప్పి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు. తన బాబు పేరుని, ఫేసుని రివీల్ చేసిన ఇలియానా.. బాబు తండ్రి ఎవరు అన్న విషయంలో మాత్రం సస్పెన్స్ మెయిన్‌టైన్ చేస్తూనే వచ్చారు. ఇక ఆ సస్పెన్స్ కి ఇప్పుడు తెరదించారు. తన భర్త ఎవరో అందరికి తెలియజేశారు. రీసెంట్ గా ఇలియానా సోషల్ మీడియా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈక్రమంలోనే ఆమె తన భర్త ఎవరో అందరికి తెలియజేశారు. ఇంతకీ ఇలియానా పెళ్లాడిన ఆ వ్యక్తి ఎవరు..?
గతంలో ‘డేట్ నైట్’ అంటూ ఒక వ్యక్తితో ఉన్న ఫోటోలను ఈ భామ షేర్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే అప్పుడు అతనే తన భర్త అని ఆమె నేరుగా చెప్పలేదు. దీంతో ఆ విషయం పై ఒక సస్పెన్స్ అలా కొనసాగుతూ వచ్చింది. తాజాగా ఆ వ్యక్తే తన భర్త అని తెలియజేశారు. మీ సింగల్ పేరెంటింగ్ ఎలా ఉంది..? అని ఒక నెటిజెన్ క్యూస్షన్ చేసిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను సింగల్ పేరెంట్ కాదని తెలియజేస్తూ తన కొడుకుకి తండ్రి ఎవరు అన్నది తెలియజేశారు. దీంతో ఇలియానా భర్త ఎవరు అన్న క్యూస్షన్ కి ఆన్సర్ దొరికేసినట్లు అయ్యింది.
Also read : Shruti Haasan : వామ్మో.. శ్రుతిహాసన్ ఈ రేంజ్లో స్టేజి పర్ఫార్మెన్స్.. హాలీవుడ్ సింగర్స్ ని మించిపోయి..
ఇక ఇదే ఇంటరాక్షన్ మాట్లాడుతూ.. త్వరలోనే మళ్ళీ సినిమాలోకి తిరిగి వస్తానని, ప్రస్తుతం అమ్మగా తన భాద్యతలు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమాధానాలతో ఆమె అభిమానులు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే ఇలియానా పెళ్లాడిన ఈ వ్యక్తి ఎవరు..? అతను ఏం చేస్తారు..? అనేది మరో ప్రశ్నగా మారింది. కాగా ఇలియానా ఈ ఏడాది మే నెలలో తన ప్రెగ్నెన్సీ అందరికి తెలియజేశారు. ఆగస్టు 1న పండంటి మగబిడ్డకి జన్మనిచ్చి అమ్మగా ప్రమోషన్ అందుకున్నారు.
