Anchor Suma : విలేకర్లు, యాంకర్ సుమ మధ్య గొడవ.. సారీ చెప్పిన వీడియో వైరల్..
ఒక ఈవెంట్ లో సుమ కామెడీగా చేసిన కొన్ని వ్యాఖ్యలు విలేకర్లకు కోపం తెప్పించింది. దీంతో ఆమె సారీ చెబుతూ..
- gum 95921
- Published On : October 25, 2023 / 09:16 PM IST
Tollywood Media Anchor Suma conflict video gone viral
Anchor Suma : టాలీవుడ్ యాంకర్ సుమ తన వాగ్దాటితో సినిమా ఈవెంట్స్ ని చాలా హుషారుగా నడిపిస్తుంటుంది. తన టైమింగ్ తో కామెడీ పుట్టించి అందర్నీ నవ్విస్తుంటుంది. అయితే తాజాగా ఒక ఈవెంట్ లో సుమ కామెడీగా చేసిన కొన్ని వ్యాఖ్యలు విలేకర్లకు కోపం తెప్పించింది. దీంతో ఆమె సారీ చెబుతూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగింది..? ఏ ఈవెంట్ లో జరిగింది.
వైష్ణవ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఆదికేశవ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లోనే సుమ మాట్లాడుతూ.. ‘బయట స్నాక్స్ ని భోజనంలా చేస్తున్న వారు లోపలి రావాలి’ అని విలేఖర్లని ఉద్దేశిస్తూ మాట్లాడింది. ఇక ఈ కామెంట్స్ కి మీడియా ప్రతినిథులంతా ఫీల్ అయ్యారు. ఈ విషయాన్ని అక్కడే సుమని ప్రశ్నించగా.. ఆమె కూడా స్టేజి పై నుంచే సారీ చెప్పింది.
Also read : Venkatesh : వెంకటేష్ కూతురి నిశ్చితార్థం.. చిరు, మహేష్ ఫోటోలు వైరల్..
అంతేకాకుండా తాజాగా సుమ మరో వీడియోని కూడా రిలీజ్ చేసింది. ‘ఈవెంట్ లో తన మాట్లాడిన మాటలకు విలేకర్లు అందరికి క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అంటూ పేర్కొంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దీని పై నెటిజెన్స్ తమ కామెంట్స్ తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. మరి ఆ గొడవ వీడియోలు వైపు మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
Clash Between Film Journalist and Anchor #Suma At #Aadikeshava Song Launch event pic.twitter.com/HTgegxiUup
— Daily Culture (@DailyCultureYT) October 25, 2023
