Venkatesh : వెంకటేష్ కూతురి నిశ్చితార్థం.. చిరు, మహేష్ ఫోటోలు వైరల్..

వెంకటేష్ కూతురి నిశ్చితార్థం వేడుక హైదరాబాద్ లో చాలా సైలెంట్ గా జరిగిపోయింది. చిరంజీవి, మహేష్ బాబు..

Venkatesh : వెంకటేష్ కూతురి నిశ్చితార్థం.. చిరు, మహేష్ ఫోటోలు వైరల్..

Chiranjeevi Mahesh Babu at Venkatesh Daugter engagement Photo

Updated On : October 26, 2023 / 10:11 AM IST

Venkatesh : టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ ఇంటిలో పెళ్లి భజంత్రీలు మొదలయ్యాయి. వెంకటేష్ కూతురి నిశ్చితార్థం వేడుక నేడు ఘనంగా జరిగింది. వెంకటేష్ కి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో పెద్ద అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి చేసేశాడు వెంకటేష్. ఇప్పుడు రెండో అమ్మాయిని అత్తారింటికి పంపించడానికి సిద్దమయ్యాడు. హైదరాబాద్ లో ఈ నిశ్చితార్థం వేడుక చాలా సైలెంట్ గా జరిగిపోయింది.

దగ్గుబాటి కుటుంబ సభ్యులు, వరుడు కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ నుంచి దగ్గర స్నేహితులు మాత్రమే ఈ నిశ్చితార్థం వేడుకకు హాజరయినట్లు సమాచారం. చిరంజీవి, మహేష్ బాబు ఈ ఎంగేజ్మెంట్ కి హాజరయ్యి నూతన జంటను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ పైగా మారింది. ఇక వెంకటేష్ తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయబోయే అబ్బాయి గురించిన విషయానికి వస్తే.. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయి అని సమాచారం.

Also read : War 2 : స్పెయిన్‌లో వార్ 2 మొదటి షెడ్యూల్ కంప్లీట్.. హృతిక్, ఎన్టీఆర్ డూపులతో యాక్షన్ సీక్వెన్స్..

 

View this post on Instagram

 

A post shared by Moviepandit (@moviepandit007)