Tollywood Movies : దేశాలు దాటుతున్న సినిమాలు..
రాష్ట్రం దాటి షూటింగ్స్ ప్లాన్ చెయ్యడమే కాకుండా ఫారెన్ షెడ్యూల్స్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు మన స్టార్లు..
- sekhar
- Published on- July 20, 2021 / 03:45 PM IST
Tollywood Movies Planning For Outdoor Shooting
Tollywood Movies: నిన్న మొన్నటివరకు ఇంట్లోంచి అడుగుపెట్టని స్టార్లు ఇప్పుడు ఆగకుండా షూటింగ్స్ చేసేస్తున్నారు. అంతేనా .. అవుట్ ఆఫ్ ది స్టేట్ వెళ్లి మరీ సినిమాలకు అందాల్ని అద్దుతున్నారు. రాష్ట్రం దాటి షూటింగ్స్ ప్లాన్ చెయ్యడమే కాకుండా ఫారెన్ షెడ్యూల్స్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు మన స్టార్లు.
కరోనాతో కంటిన్యూ అవ్వాల్సిందేనని.. ధైర్యం చెప్పుకుని సినిమాలు మాత్రం ఫుల్ స్పీడ్‌లో లాగించేస్తున్నారు మేకర్స్. మొన్న మొన్నటి వరకూ స్టూడియో, సెట్స్ మీద తప్ప అవుట్ డోర్ మీద ఆసక్తి చూపించిన స్టార్లు ఇప్పుడు రాష్ట్రాలు, దేశాలు దాటి షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటున్నారు. లేటెస్ట్గా బాలకృష్ణ-బోయపాటి ‘అఖండ’ సినిమా షెడ్యూల్ తమిళనాడులోని కుంభకోణంలో మొదలు పెట్టారు.
Balakrishna : ‘అఖండ’ ఆన్ ది వే..
రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ కి సంబంధించి ఇంకా రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆల్రెడీ ఒక్క పాట అన్నపూర్ణ స్టూడియోలో షూట్ చేస్తుంటే.. రెండో సాంగ్ మాత్రం ఫారెన్ వెళ్లడానికి ప్లాన్ చేస్తోంది రాజమౌళి అండ్ టీమ్. చరణ్, శంకర్‌తో చెయ్యబోతున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా అమెరికాలోనే జరుగబోతోంది.
RRR Poster : ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై పోలీస్ పంచ్.. పోలీసుల పంచ్‌పై రివర్స్ పంచ్!
అక్కినేని ఫ్యామిలీ కూడా ఫారెన్ ట్రిప్‌కి రెడీ అవుతోంది. నాగార్జున – ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా చెకోస్లోవేకియాలో షూట్ ప్లాన్ చేస్తుంటే.. నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీ మరోసారి ఇటలీ షెడ్యూల్‌కి రెడీ అవుతోంది. ఇక అఖిల్ – సురేందర్ రెడ్డి మూవీ ‘ఏజెంట్’ మూవీ షెడ్యూల్ కూడా జార్జియాలో ప్లాన్ చేస్తున్నారు.
