RRR Poster : ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై పోలీస్ పంచ్.. పోలీసుల పంచ్‌పై రివర్స్ పంచ్!
‘ఆర్ఆర్ఆర్’ సినిమా కొత్త పోస్టర్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు సరికొత్తగా చూడ్డమే కాక.. ట్రాఫిక్ జాగ్రత్తలు పాటించాలంటూ తమ స్టైల్లో క్రియేటివ్‌గా చెప్పుకొచ్చారు..

Cyberabad Traffic Police Made Rrr Poster Goes Viral
RRR Poster: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్-రౌద్రం, రణం, రుధిరం’.. షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది. ఇప్పటికి రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి అయింది. ఆల్రెడీ తారక్, చెర్రీ రెండు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేశారు. జూలై నెలాఖరు వరకు ‘RRR’ షూటింగ్ పూర్తవుతుందని చెబుతూ.. టీం చరణ్, ఎన్టీఆర్ కలిసి ఉన్న న్యూ పోస్టర్ రిలీజ్ చెయ్యగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
RRR : రామ్ – భీమ్.. పోస్టర్ అదిరిందిగా..!
ఎన్టీఆర్ బుల్లెట్ నడుపుతుండగా అతని భుజాలపై చేతులు వేసి చరణ్ వెనుక కూర్చుని ఉన్నాడు. ఈ పోస్టర్ మెగా – నందమూరి అభిమానులను, సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ పోస్టర్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు సరికొత్తగా చూడ్డమే కాక.. ట్రాఫిక్ జాగ్రత్తలు పాటించాలంటూ తమ స్టైల్లో క్రియేటివ్‌గా చెప్పుకొచ్చారు.
‘ఆర్ఆర్ఆర్’ టీం పోస్ట్ చేసిన పోస్టర్‌లో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ హెల్మెట్స్ ఉండవు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ టీం హీరోలిద్దరికీ ఫొటో షాప్‌లో హెల్మెట్స్ పెట్టారు. అలాగే సైడ్ మిర్రర్స్ కూడా పెట్టారు. ‘ఇప్పుడు ఫర్ఫెక్ట్‌గా ఉంది.. హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఉండండి’ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ టీం మెంబర్స్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ పంచ్ చేశారు.
ఈ పిక్ నెట్టింట వైరల్ అవడమే కాక అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ టీం చేసిన ఈ ట్వీట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ట్విట్టర్ హ్యాండిల్ రివర్స్ పంచ్ వేసింది.. ‘పర్ఫెక్ట్ కాదు.. నెంబర్ ప్లేట్ మిస్సింగ్’ అంటూ పంచ్ వేసింది.
Still it’s not perfect. The number plate is missing ?
— RRR Movie (@RRRMovie) June 29, 2021