Tollywood Producers met Telangana new Cinematography Minister Komatireddy Venkat Reddy
Tollywood : తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది. దీంతో సినీ పరిశ్రమకి కొత్త మంత్రి కూడా వచ్చారు. తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భాద్యతలు తీసుకున్నారు. అయితే మంత్రిగా పదవి చేపట్టిన తరువాత.. టాలీవుడ్ నుంచి తనకి ఏ అభినందనలు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. కేవలం దిల్ రాజు మాత్రమే పదవి చేపట్టినందుకు అభినందించారని, మిగిలిన టాలీవుడ్ ప్రముఖులెవ్వరు తనని విష్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ విషయాన్ని కోమటిరెడ్డి ప్రెస్ మీట్ లోని చెబుతూ.. “టాలీవుడ్ లెక్కలనీ త్వరలోనే తెలుస్తా” అని వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఆ కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇక తాజాగా టాలీవుడ్ లోని ప్రముఖులు మంత్రి కోమటిరెడ్డిని కలుసుకొని ఆయనకు అభినందనలు తెలియజేశారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఆధ్వర్యంలో పలువురు ముఖ్య నిర్మాతలు, ఆర్టిస్ట్‌లు, డైరెక్టర్స్ కోమటిరెడ్డిని కలుసుకొని విషెస్ తెలియజేశారు. ఈ సమావేశంలో రాఘవేంద్రరావు, సి కళ్యాణ్, సురేష్ బాబు, నట్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also read : Salaar : కేజీఎఫ్‌కి చేసిన తప్పునే సలార్‌కి కూడా చేశానంటున్న ప్రశాంత్ నీల్..
ఇక ఈ మీటింగ్ లో సినీ పరిశ్రమకి సంబంధించిన పలు విషయాలను, సమస్యలను కోమటిరెడ్డితో చర్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సమావేశానికి చెందిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి నిర్మాతలు వంతు అయ్యిపోయింది. ఇండస్ట్రీలోని అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ కూడా కోమటిరెడ్డిని కలిసి అభినందనలు తెలియజేస్తారేమో చూడాలి.