Harika Narayan : స్టార్ సింగర్ పెళ్ళిలో.. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ సందడి..
స్టార్ సింగర్ హారిక నారాయణ్ పెళ్ళిలో సందడి చేసిన టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్.
- gum 95921
- Published On : March 18, 2024 / 12:34 PM IST
tollywood singer Harika Narayan marriage photos gone viral
Harika Narayan : ఈ ఏడాది స్టార్టింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీలో పెళ్లి సందడి ఎక్కువగా కనిపిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్, మీరా చోప్రా, అక్షా పార్ధసాని, నటాషా దోషి, కృతికర్భందా.. ఇలా ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కువు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సింగర్ కూడా ఏడడుగులు వేసేసారు. తన సింగింగ్ టాలెంట్ తో సూపర్ సింగర్ అనిపించుకున్న ‘హారిక నారాయణ్’ తన ప్రియుడు ‘పృథ్వినాథ్ వెంపటి’తో మూడుముళ్లు వేయించుకున్నారు.
వీరిద్దరూ ఏడేళ్లుగా ప్రేమించుకుంటూ వస్తున్నారు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకొని పెళ్ళికి సిద్ధమయ్యారు. తాజాగా ఏడడుగులు వేసేసి పెళ్లి జీవితాన్ని మొదలు పెట్టారు. ఇక ఈ పెళ్ళిలో టాలీవుడ్ సింగర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ సందడి చేసారు. తెలుగు స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎం ఎం కీరవాణి, మణిశర్మ, సింగర్ రేవంత్ తదితరులు పెళ్లికి హాజరయ్యి కొత్త జంటని ఆశీర్వదించారు.
Also read : Pushpa 2 – Kalki 2898 AD : పుష్ప 2 వాయిదా.. కల్కి ఆగష్టులో.. ఎన్నికల షెడ్యూల్‌తో రిలీజ్‌లు మారుతున్నాయా..
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజెన్స్ కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హారికకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో స్టార్ హీరోలకు పాటలు పాడడంతో పాటు.. ప్రైవేట్ ఆల్బం సాంగ్స్ తో కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఆ సాంగ్స్ లోని తన వాయిస్ తో సోషల్ మీడియా నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంటారు.
