TOP 5 Fastest 100 Million Hindi Dubbed Movies: మన తెలుగు సినిమాలకు దక్షిణాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గతకొద్ది కాలంగా హిందీ డబ్బింగ్ వెర్షన్ తెలుగు సినిమాలు యూట్యూబ్‌లో దక్కించుకుంటున్న వ్యూస్ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్లాప్ అయిన సినిమాలు సైతం హిందీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. మిలియన్ల కొద్ది వ్యూస్, లక్ష్ల కొద్ది లైక్స్ రాబడుతున్నాయి.
యూట్యూబ్‌లో 5 ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న సినిమాల విషయానికొస్తే.. ఐదులో మూడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమాలు ఉండడం విశేషం. పైగా అందులో రెండు ఫ్లాప్ చిత్రాలు..
తేజ డైరెక్ట్ చేసిన ‘సీత’ కేవలం 15 రోజుల్లోనే వంద మిలియన్ల మార్క్ టచ్ చేసింది. తర్వాత అక్కినేని అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ 27 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. బెల్లంకొండ, కాజల్ నటించిన ‘కవచం’ 40 రోజుల్లో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే (దువ్వాడ జగన్నాథమ్) 71 రోజుల్లో ఆ స్థాయి వ్యూస్ రాబట్టాయి.
బెల్లంకొండ మరో చిత్రం ‘జయ జానకి నాయక’ 81 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇలా టాప్ 5 లో బెల్లం బాబువి మూడు చిత్రాలు ఉండడం, వాటిలో రెండు సినిమాల్లో కాజల్ కథానాయికగా నటించడం విశేషం.