Dil Raju : టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి తెలంగాణ సర్కార్ కీలక పదవి..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలాంటిది ఆయనకి ఇప్పుడు ఓ కీలక పదవి దక్కింది.

Top Producer Dil Raju Key Post in Telangana government

Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ అయ్యారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలను నిర్మించి సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నారు. స్టార్ హీరో సినిమాల దగ్గర నుండి చిన్న సినిమాల వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించి టాప్ నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు.

Also Read : Sreeleela Mother : సింగిల్ మదర్ గా అమ్మ కష్టాలు అప్పుడు అర్దమవ్వలేదు.. శ్రీలీల ఎమోషనల్.. బాలయ్య షోలో శ్రీలీల తల్లి..

కేవలం స్టార్ హీరో సినిమాలే కాకుండా చిన్న సినిమాల కోసం కూడా ఒక ప్రత్యేకమైన బ్యానర్ పెట్టారు. “దిల్ రాజు ప్రొడక్షన్స్” పేరుతో చిన్న సినిమాను నిర్మిస్తూ.. ఇప్పుడు మరో బ్యానర్ కూడా స్టార్ట్ చెయ్యనున్నారు. కొత్త టాలెంట్ ప్రోత్సహించడానికి “దిల్ రాజు డ్రీమ్స్” అనే కొత్త బ్యానర్ స్టార్ చేస్తున్నారు. అలాంటిది ఆయనకి ఇప్పుడు ఓ కీలక పదవి దక్కింది. తాజాగా తెలంగాణ గవర్నమెంట్ దిల్ రాజును “తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కి ఛైర్మెన్ గా నియమించారు”. ఆయనకి ఈ పదవి రెండేళ్ల పాటు ఉంటుంది. దీంతో ఈ వార్త వైరల్ అవుతుంది.

ఎందరో కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ, ఎందరో నూతన దర్శకులకి, నటీనటులకు అవకాశాలు అందిస్తూ దిల్ రాజు ఈ స్థాయికి చేరారు. ఇక ఇపుడు “తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కి ఛైర్మెన్” గా నియమితమైనందుకు సినీ ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇప్పుడు ఆయన బ్యానర్ లో పలు స్టార్ హీరోల సినిమాలు రాబోతున్నాయి. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కూడా ఉంది.