Top Trolling Videos : మోస్ట్ ట్రోలింగ్ వీడియోస్ ఇవే..!
‘అయ్యయ్యో వద్దమ్మా... సుఖీభవా..’ సోషల్ మీడియాలో మునిగి తేలే వాళ్లకు ఈ పదాలేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది..
- sekhar
- Published on- September 28, 2021 / 07:04 PM IST
Top Trolling Videos
Top Trolling Videos: ‘అయ్యయ్యో వద్దమ్మా… సుఖీభవా..’ సోషల్ మీడియాలో మునిగి తేలే వాళ్లకు ఈ పదాలేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ లైన్స్ వాడి మీమ్స్, ట్రోల్స్.. ఓ రేంజ్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని యాడ్స్, సాంగ్స్ ఇలానే ట్రెండ్ అవుతున్నాయి. ఎప్పుడో జనాల ముందుకొచ్చినా.. సామన్య జనం ఫేమస్ చేస్తే కానీ ట్రెండింగ్‌లో సీట్ దక్కించుకోట్లేదు.
Sahid Kapoor : సమంతకు షాహిద్ ఫిదా..
ఇదీ భాగోతం.. ఎప్పుడో ఆర్నెళ్ల క్రితం వచ్చిన ఓ టీ పౌడర్ యాడ్ ఇప్పుడు ఫేమసై కూర్చుంది. హైదరాబాద్‌కు చెందిన శరత్.. ఓ రోజు పెళ్లి డ్యాన్స్‌లో భాగంగా డ్యాన్స్ వేస్తూ సరదాగా.. ‘అయ్యయ్యో వద్దమ్మా.. ఆ పక్కనే టీ కొట్టు ఉంది. అందరికీ ఓ కప్పు టీ ఇద్దామనుకున్నాను.. సుఖీభవ.. సుఖీభవ..’ అంటూ పాటపాడి తీన్మార్ స్టెప్పు లేసాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వైరల్ అవడమే కాదు.. శరత్.. రాత్రికి రాత్రే సెలబ్రిటీ కూడా అయిపోయాడు. ఓవర్ నైట్ యూట్యూబ్ స్టార్‌గా రచ్చ చేసాడు.
Vijay – Mahesh : ఫ్రెండ్ కోసం సూపర్‌స్టార్ మహేశ్
ఎన్నో మీమ్స్, ఎన్నో ట్రోల్స్, ఎన్నో షార్ట్స్.. ‘అయ్యయ్యో వద్దమ్మా’ అని కొడితే అసలైన టీ పౌడర్ యాడ్ రాకుండా.. ఫన్నీ వీడియోసే యూట్యూబ్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ప్రెజెంట్ ఏది ట్రెండ్ అయినా వాళ్లకు తగ్గట్టు మార్చుకుని పోస్ట్ చేస్తోన్న హైదరాబాద్ సిటీ పోలీసులు.. వాళ్ల ట్విట్టర్ టీంకి పని చెప్పారు. జనాలకు అవగాహన కల్పించేందుకు సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో చెప్పి.. ‘అయ్యాయ్యో వద్దమ్మా’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
‘మీరు బహుమతి గెలుచుకున్నారు.. అభినందనలు.. ఈ అవార్డును పొందడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి’.. అంటూ వచ్చే మెసేజులను నమ్మకండి. వాటికి అయ్యయ్యో వద్దమ్మా.. అనేసేయండి..’ అంటూ హైదరాబాద్ సిటీ, సైబర్ క్రైమ్ పోలీసులు ఫన్నీగా ట్వీట్లు చేస్తున్నారు. ఆ ట్వీట్లు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Prabhas Family : ఫ్యామిలీ పెద్దదే డార్లింగ్..!
ఇప్పుడు శరత్ ఫేమస్ చేస్టే యాడ్ ట్రెండ్‌లోకి వచ్చినట్టు.. జనాలు పైకి తెస్తున్న సాంగ్స్, యాడ్స్ ఈమధ్య చాలానే పుట్టుకొస్తున్నాయి. రీసెంట్గా పెళ్లి కూతురు భరత్‌లో డ్యాన్స్ చేసిన ‘బుల్లెట్ బండి’ పాట కూడా యమ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికీ ఫుల్ ఫామ్‌లో దూకుడు చూపిస్తూనే ఉంది ‘బుల్లెట్ బండి’ సాంగ్. దీంతో మోహన భోగరాజు పాడిన ఒరిజనల్ సాంగ్‌కు సూపర్ హైప్ క్రియేటైంది. ఇప్పటి వరకు కాస్త లైట్‌గానే తీసుకున్న జనాలు.. ఇప్పుడీ పాటొస్తే ఊగిపోతున్నారు.
