Vijay – Mahesh : ఫ్రెండ్ కోసం సూపర్‌స్టార్ మహేశ్

తన స్నేహితుడు దళపతి విజయ్ సినిమా కోసం సూపర్‌స్టార్ మహేష్ బాబు రాబోతున్నారు..

Vijay – Mahesh : ఫ్రెండ్ కోసం సూపర్‌స్టార్ మహేశ్

Mahesh Vijay

Updated On : September 28, 2021 / 1:10 PM IST

Vijay – Mahesh: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్‌ను టాలీవుడ్‌కి తీసుకొస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఇటీవల సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్ సెట్ చేసిన రాజు ఇప్పుడు విజయ్, వంశీ పైడిపల్లితో సినిమా అనౌన్స్ చేశారు.

Sahid Kapoor : సమంతకు షాహిద్ ఫిదా..

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని దసరా పర్వదినాన అక్టోబర్ 15న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. మహేష్ బాబుని ముఖ్య అతిథిగా ఆహ్వానించగా ఆయన వస్తానని చెప్పారట. విజయ్ – మహేష్ ఎప్పటినుంచో ఫ్రెండ్స్.. ఇద్దరూ చెన్నైలో కలిసి చదువుకున్నారు.

Thalapathy 66 : దళపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీ..

శంకర్ – చరణ్ సినిమా ఓపెనింగ్‌కి చిరంజీవి, రాజమౌళితో పాటు బాలీవుడ్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్ కూడా వచ్చి సందడి చేశారు. ఇప్పుడు విజయ్ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నారు. కోలీవుడ్ నుంచి మరికొందరు సినీ ప్రముఖులు రావచ్చని తెలుస్తోంది.

Mahesh Babu Vijay