Trisha : విజయ్ సీఎం అయ్యాక.. త్రిష మొదటి సినిమా ఈవెంట్.. హైదరాబాద్ లోనే.. ఎక్కడ? ఎప్పుడు?
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. (Trisha)
- Saketh U
- Updated on- May 11, 2026 / 02:15 PM IST
Trisha
Trisha : త్రిష నేడు హైదరాబాద్ రానుందని సమాచారం. త్రిష ప్రస్తుతం విజయ్ సీఎం అయిన ఆనందాన్ని ఎంజాయ్ చేస్తుంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న త్రిష ఓ సినిమా ప్రమోషన్ కోసం నేడు హైదరాబాద్ రాబోతున్నట్టు సమాచారం.
సూర్య హీరోగా నటించిన కరుప్పు సినిమా మే 14న రిలీజ్ కాబోతుంది. RJ బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈ సినిమా వీరభద్రుడు అనే టైటిల్ తో రాబోతుంది. నేడు వీరభద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనుంది. నేడు మే 11 సాయంత్రం 6 గంటల నుంచి వీరభద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని JRC కన్వెషన్ లో జరగనుంది. ఈ ఈవెంట్ కి సూర్య, RJ బాలాజీతో పాటు మూవీ టీమ్ అంతా హాజరు కానున్నారు. త్రిష కూడా వస్తుందని సమాచారం. దీంతో విజయ్ సీఎం అయ్యాక త్రిష హాజరయ్యే మొదటి సినిమా ఈవెంట్ కావడంతో తెలుగు ఆడియన్స్ తో పాటు తమిళ్ ఆడియన్స్ లోను ఆసక్తి నెలకొంది.
Also Read : Vijay-Sangeetha : సీఎం అయిన విజయ్.. లండన్‌లో సెటిల్ అయిపోతున్న విజయ్ భార్య..?
ఇక విజయ్ – హీరోయిన్ త్రిష రిలేషన్ షిప్ లో ఉన్నారు అని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. విజయ్ భార్య సంగీత కూడా విజయ్ వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడని ఆరోపణలు చేస్తూ విడాకులు కోరడం, విజయ్ త్రిషతో కలిసి ఓ పెళ్ళికి హాజరవడం, త్రిష తన పోస్టులతో ఇండైరెక్ట్ హింట్స్ ఇవ్వడం, నిన్న జరిగిన విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష హాజరయి విజయ్ పేరెంట్స్ పక్కనే కూర్చోవడం.. వీటన్నిటితో త్రిష రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తుంది.
