CM Vijay – Sangeetha : సీఎం అయిన విజయ్.. లండన్లో సెటిల్ అయిపోతున్న విజయ్ భార్య..?
విజయ్ భార్య ఎక్కడుంది అని చర్చ మొదలైంది. (Vijay Sangeetha)
Tamilnadu Cm Vijay Wife Sangeetha
Vijay-Sangeetha : తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించారు. పొలిటికల్ గా సక్సెస్ అయిన విజయ్ పర్సనల్ లైఫ్ లో మాత్రం విమర్శలు ఎదుర్కుంటున్నారు. కొన్ని నెలల క్రితం విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. విజయ్ వేరే మహిళతో రిలేషన్ లో ఉన్నాడని, ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాడని, అవమానాలకు గురిచేసాడని.. తీవ్ర ఆరోపణలు చేసింది సంగీత.
విజయ్ హీరోయిన్ త్రిషతో రిలేషన్ లో ఉన్నట్టు ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. సంగీత విడాకులు కోరడం, ఆ తర్వాత విజయ్ – త్రిష కలిసి బయట పెళ్ళిలో కనపడటం, విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి త్రిష రావడం, త్రిష ఇండైరెక్ట్ గా హింట్స్ ఇస్తుండటంతో వీరి రిలేషన్ షిప్ నిజమే అని అంతా అనుకుంటున్నారు. త్రిష వచ్చినా విజయ్ ప్రమాణ స్వీకారానికి అతని భార్య సంగీత, ఇద్దరు పిల్లలు మాత్రం రాలేదు.
Also Read : Tanikella Bharani : మోదీని కలిసిన తనికెళ్ళ భరణి.. నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి చూడలేదు అంటూ ఎమోషనల్ పోస్ట్..
దీంతో విజయ్ భార్య ఎక్కడుంది అని చర్చ మొదలైంది. ప్రస్తుత సమాచారం ప్రకారం విజయ్ భార్య లండన్ లో ఉందట. లండన్ లో తన తండ్రికి సంబంధించిన వ్యాపారాలు ఉండగా అవి చూసుకుంటూ సంగీత అక్కడే ఉందట. సంగీతకు బ్రిటన్ పౌరసత్వం కూడా ఉందని తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా సంగీత లండన్ లోనే స్థిరపడబోతున్నట్టు తమిళ మీడియా సమాచారం.
ఇక విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా మారాడు. సందీప్ కిషన్ హీరోగా సంజయ్ దర్శకత్వంలో మొదటి సినిమా తెరకెక్కుతుంది. దీంతో సంజయ్ దర్శకుడిగా ఇక్కడే ఉంటాడని అప్పుడప్పుడు లండన్ వెళ్ళొస్తాడని తెలుస్తుంది. విజయ్ కూతురు దివ్య సాష మాత్రం ప్రస్తుతం చదువుకుంటుంది. ఆమె కూడా తల్లితో కలిసి లండన్ లోనే స్థిరపడనున్నట్టు సమాచారం.
Also See : Nayan Sarika : కొత్త సినిమా ఓపెనింగ్ లో నయన్ సారిక.. గాగ్రాచోళీలో అదరగొడుతుందిగా..
గత కొంతకాలంగా విజయ్ – సంగీత విడిగానే ఉంటున్నారు. అధికారికంగా కోర్టు నుంచి విడాకులు రావడం మిగిలి ఉంది. విజయ్ తన భార్య సంగీతకు కొంత భరణం చెల్లించి కోర్టు బయటే ఈ కేసు క్లోజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విజయ్ లాయర్ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు.
