Trisha Vijay : త్రిషకు నో చెప్పిన విజయ.. త్రిష ప్లేస్ లో ఆ డ్యాన్స్ మాస్టర్..?

ఇప్పుడు త్రిషకు విజయ్ నో చెప్పాడట. (Trisha Vijay)

  • Published on- June 5, 2026 / 03:22 PM IST

Trisha Vijay

Trisha Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో గెలిచి, తన టీవీకే పార్టీని గెలిపించి తమిళనాడు సీఎం అయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేసాడు. ఒకటి పెరంబూరు కాగా మరొకటి తిరుచ్చి ఈస్ట్. ఈ రెండు స్థానాల్లోనూ విజయ్ గెలిచారు. దీంతో సీఎం అయ్యాక తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాజీనామా చేసారు విజయ్.

తిరుచ్చి ఈస్ట్ విజయ్ గెలిచి రాజీనామా చేయడంతో మళ్ళీ ఎలాగైనా ఆ స్థానాన్ని టీవీకే పార్టీనే గెలుచుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో హీరోయిన్ త్రిష అక్కడ పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. విజయ్ – త్రిష రిలేషన్ షిప్ లో ఉండటం, త్రిష పార్టీ కోసం పరోక్షంగా పనిచేయడంతో త్రిషని తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో టీవీకే పార్టీ నుంచి నిలబడతారని వార్తలు వచ్చాయి. అవి అబద్దం ఆ పార్టీ తరపున కూడా అని ఎవరూ స్పందించకపోవడంతో అందరూ త్రిషనే ఫిక్స్ అయ్యారు. త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తాను, సీఎం అవుతాను అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

Also See : Pawan Kalyan : మహిళలు, చిన్నారులతో కలిసి పవన్ కళ్యాణ్.. సీడ్ బాల్స్ తయారీలో..

అయితే ఇప్పుడు త్రిషకు విజయ్ నో చెప్పాడట. తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికలో త్రిష పోటీ చేయట్లేదట. తమిళ మీడియా సమాచారం ప్రకారం త్రిష బదులు డ్యాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ని తిరుచ్చి ఈస్ట్ లో పోటీ చేయించాలని విజయ్ చూస్తున్నారట. రాఘవ లారెన్స్ పార్టీలో లేకపోయినా విజయ్ కి మొదటి నుంచి మద్దతు తెలుపుతున్నారు. విజయ్ సీఎం అయ్యాక లారెన్స్ అభినందించారు. సినిమాటోగ్రఫీ శాఖామంత్రి నియామకంపై విశాల్ విమర్శిస్తే అప్పుడు కూడా లారెన్స్ విజయ్ నే సపోర్ట్ చేసాడు.

పైగా లారెన్స్ మాస్టర్ కి చాలా మంచి పేరు ఉంది. ఆయన చేసే సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ఆయనపై పాజిటివ్ ఒపీనియన్ ఉంది. లారెన్స్ మాస్టర్ వివాదాలకు కూడా దూరంగా ఉంటారు. రెగ్యులర్ గా సేవా కార్యక్రమాలు చేస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే విజయ్ కచ్చితంగా తిరుచ్చు ఈస్ట్ గెలవాలని అందుకు రాఘవ లారెన్స్ మాస్టర్ ని పోటీ చేయించాలని చూస్తున్నారని టీవీకే అంతర్గత సమాచారం.

Also Read : Manoj Bajpayee : వారణాసి వెయ్యి కోట్ల బడ్జెట్.. అదంతా ప్రమోషన్ స్టంట్.. బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..