Trisha Krishnan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్..

  • Publish Date - October 3, 2020 / 02:32 PM IST

Trisha – Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహాద్భుతం గా ముందు కొనసాగుతుంది.


విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు ప్రముఖ హీరోయిన్ త్రిష. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారామె.


వాతావరణం పరిరక్షణ మనందరి బాధ్యత కాబట్టి నా బాధ్యతగా నేను ఈరోజు మొక్కలు నాటాను.. మీరు కూడా ఇందులో పాల్గొని మొక్కలు నాటాలని అభిమానులకు పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు త్రిష.