Trisha Krishnan : వామ్మో.. త్రిష మూవీ లైనప్ చూసారా.. సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతుందిగా

గత రెండున్నర దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీ లో తిరుగులేని హీరోయిన్ గా వరుస సినిమాలు చేసి భారీ క్రేజ్ తెచ్చుకుంది త్రిష.

Trisha movie line up back to back movies with star heros

Trisha Krishnan : గత రెండున్నర దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీ లో తిరుగులేని హీరోయిన్ గా వరుస సినిమాలు చేసి భారీ క్రేజ్ తెచ్చుకుంది త్రిష. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో సైతం జోరు చూపిస్తుంది ఈ బ్యూటీ. 2003లో టాలీవుడ్‌లో ‘నీ మనసు నాకు తెలుసు’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది.

Also Read : Pushpa 2 Song : ‘పుష్ప 2 నుండి పీలింగ్స్ ఫుల్ సాంగ్ వచ్చేసింది’.. శ్రీవల్లి, పుష్ప రాజ్ స్టెప్స్ తో అదరగొట్టారుగా..

ఆ మధ్యకాలంలో సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ భామ. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తుంది. గత ఏడాది ‘లియో’ సినిమాలో దళపతి విజయ్‌కు జోడీగా నటించి మంచి విజయాన్ని అందుకుంది. త్వరలోనే చిరంజీవి ‘విశ్వంభర’ మూవీతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమాతో పాటు ఏకంగా ఏడూ సినిమాలు లైన్ లో పెట్టింది ఈ బ్యూటీ.

అజిత్ హీరోగా వస్తోన్న ‘విదాముయార్చి’ సంక్రాంతి రానుంది. దీని తర్వాత అజిత్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, అలాగే కమల్ హాసన్‌తో ‘థగ్ లైఫ్’, మలయాళంలో మోహన్ లాల్‌తో ‘రామ్’,సూర్య 45లోనూ త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవే కాకుండా మలయాళంలో ‘ఐడెంటిటీ’ అనే సినిమా కూడా చేస్తుంది. ఇలా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది త్రిష.