Trivikram : సూర్యతో సినిమా చేయమని మా వైఫ్ డిమాండ్ చేస్తుంది.. త్రివిక్రమ్ కామెంట్స్..

విశ్వనాథ్ & సన్స్ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ..(Trivikram)

  • Updated on- August 16, 2026 / 09:54 AM IST

Trivikram

Trivikram : సూర్య, మమిత బైజు జంటగా నటించిన విశ్వనాథ్ & సన్స్ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. నేడు ఈ సినిమా సక్సెస్ మీట్ ని నిర్వహించగా ఈ ఈవెంట్ కి త్రివిక్రమ్ గెస్ట్ గా హాజరయ్యారు.

Also See : Nandamuri Deepika : స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఎన్టీఆర్ వదినమ్మ.. నందమూరి దీపిక ఫొటోలు..

విశ్వనాథ్ & సన్స్ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి ఆల్రెడీ. కానీ నేను ఆయనకు నచ్చే కథ చెప్పలేకపోయాను. త్వరలోనే ఆయనతో కలిసి పని చేయాలి అని అనుకుంటున్నాను. సూర్యతో సినిమా చేయమని నా వైఫ్ డిమాండ్. ఆమె నన్ను ఎప్పటినుంచో అడుగుతుంది సూర్యతో సినిమా చేయమని. ఆమె సూర్య కు ఫ్యాన్.

ఆమె సితార సంస్థలో జరిగే ఏ షూటింగ్ కి వెళ్ళదు కానీ ఈయన సినిమా షూటింగ్ అని ఓ రోజు ప్రత్యేకంగా వెళ్లి సూర్యని కలిసి ఆయనతో ఫోటో దిగి వెళ్లారు. ఆడవాళ్లు అంత ఈజీగా ఇష్టపడరు. ఇష్టపడితే జీవితాంతం వదిలిపెట్టారు. అలాంటి హీరోలు కొంతమందే ఉంటారు. అలాంటివాళ్ళల్లో సూర్య ఒకరు. త్వరలోనే ఆయనతో కూడా కచ్చితంగా సినిమా చేస్తాను అని తెలిపారు. దీంతో భవిష్యత్తులో త్రివిక్రమ్ – సూర్య సినిమా ఉండొచ్చు అని తెలుస్తుంది.

Also Read : Selvamani : ఆమె అందరి మీద అరుస్తుంది.. రోజాపై భర్త సెల్వమణి కామెంట్స్ వైరల్..