Tv actor Sravani suicide case: టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది. సూసైడ్ కు ముందు సాయి, శ్రావణిల మధ్య వివాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి కీలకమైన ఆధారం మరొకటి వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి రోడ్డుపై సాయి బెదిరిస్తున్న దృశ్యాలు శ్రీకన్య హోటల్ దగ్గర సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అందులో శ్రావణిని సాయి బెదిరించి ఆటోలో తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
ఆటో ఎక్కేందుకు నిరాకరించిన శ్రావణి.. అతని బెదిరింపులు తట్టుకోలేక ఆటోలో వెళ్లిపోయింది. ఇప్పటికే సాయి తనపై దాడి చేశాడని ఆడియో ఆధారంగా ఈ ఫుటేజీ కూడా కేసులో కీలకంగా మారింది. దేవరాజ్, సాయిల బెదిరింపులతోనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీరియల్ నటి ఆత్మహత్య కేసు మిస్టరీగా మారింది..
ఆమె చేసిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. శ్రావణిని వేధించింది సాయి లేదా దేవరాజ్ అని అనుమానం పోలీసుల్లో వ్యక్తమైంది.. దేవరాజ్ పుట్టినరోజు సందర్భంగా శ్రావణి వీడియో ద్వారా తెలియజేసింది..దేవ్ పై తనకున్న అభిమానాన్ని వీడియోలో తెలిపింది. మై లవ్ లీ హీరో దేవ్ రాజ్ అంటూ వీడియో చేసింది.. దేవరాజ్ ను హర్ట్ చేసినందుకు శ్రావణి సారీ కూడా చెప్పినట్టు వీడియోలో ఉంది.