Exclusive : శ్రావణి చావుకు కారకులెవ్వరు? ఆ నిర్మాతకు సంబంధం ఏంటి? రోజుకో ట్విస్టు.. పూటకో మలుపు..!

  • Publish Date - September 11, 2020 / 08:43 PM IST

Tv actor Sravani suicide case: టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు క్రైమ్ సీరియల్‌ను తలపిస్తోంది. రోజుకో ట్విస్టులతో పోలీసులకు పిచ్చెక్కిస్తోంది. శ్రావణి చావుకు కారణం ఎవరు? దేవరాజ్ రెడ్డి లేదా సాయిరెడ్డినా? అసలు శ్రావణి కేసులోకి ఆర్ఎక్స్ నిర్మాత పేరు ఎందుకు వచ్చింది? ఈ కేసులో అరెస్టులు ఎప్పుడు మొదలవుతాయి.. తొలుత దేవరాజ్ నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతన్ని విచారించారు. దేవరాజ్ అందించిన ఆధారాలతో ఈ కేసు ఇప్పుడు సాయిరెడ్డి మెడకు చుట్టుకుంది. హోటల్ లో గొడవ జరిగిన మరుసటి రోజే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. సాయి, అశోక్ రెడ్డిని పోలీసులు విచారించిన తర్వాత ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలుకానుంది.



దేవరాజ్, శ్రావణిలపై సాయి దాడి :
సెప్టెంబర్ 7న ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకన్య హోటల్‌కి వెళ్లారు.. అక్కడికి వెళ్లిన సాయి.. శ్రావణి, దేవరాజులపై సాయి దాడి చేశాడు.. శ్రావణిపై చేయి చేసుకున్నాడు.. అంతటితో ఆగలేదు. ఈ విషయాన్ని శ్రావణి కుటుంబ సభ్యులకు సాయి చెప్పాడు.. దీంతో ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని దేవరాజ్ కు ఫోన్ కాల్ చేసి చెప్పిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి ఆత్మహత్యకు దేవ్ రాజే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.



నిర్మాతతో సహజీవనం చేయాలంటూ వేధింపులు :
శ్రీకన్య హోటల్ కు వెళ్లిన పోలీసులు అక్కడి సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. అందులో సాయి దేవరాజుపై దాడి చేయడం, శ్రావణిపై చేయి చేసుకోవడం విజువల్స్ స్పష్టంగా కనిపించాయి. అటు ఆర్ఎక్స్ 100 నిర్మాత ఆశోక్ రెడ్డితో సహజీవనం చేయాలంటూ సాయి శ్రావణిని వేధించినట్టు తెలిసింది. అందుకే తనను అడ్డు తొలగించుకోవాలని సాయి ప్రయత్నించాడాని దేవ్ రాజ్ ఆరోపిస్తున్నాడు..



దేవరాజ్ వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందంటూ సాయిరెడ్డి ఒక ఆడియో టేప్ బయటపెట్టాడు.. అయితే ఆ వేధింపుల వ్యవహారంలోనే దేవరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ వీడియో పాతది గుర్తించగా.. ఆ తర్వాత కూడా ఆమె దేవరాజ్ తో ప్రేమయాణం సాగించిందని తాను పోలీసులకు చెప్పాడు. అది చూసి భరించలేని సాయిరెడ్డి ఆమెపై దాడి చేశాడు..



ఇంట్లో చెప్పి శ్రావణి తల్లిదండ్రులతో చెప్పి గొడవలు పెట్టించాడు. ఈ పరిణామాలతోనే సాయి, దేవరాజ్, అశోక్ రెడ్డిలను పోలీసులు విచారించనున్నారు. విచారణ తర్వాత అయిన ఈ కేసు కొలిక్కి వస్తుందా? లేదా మరేదైనా మలుపు తిరుగుతుందా? చూడాలి మరి..