TV Comedians : ఒకప్పుడు మార్కెట్‌లో కూరగాయలు అమ్మి.. ఇప్పుడు టీవీలో స్టార్ కమెడియన్స్..

తాజాగా ఇద్దరు కమెడియన్స్ కూడా తమ కష్టాలను చెప్పుకున్నారు.(TV Comedians)

  • Updated on- June 17, 2026 / 09:51 AM IST

TV Comedians

TV Comedians : సినీ, టీవీ పరిశ్రమలో ఇప్పుడు స్టార్ డమ్ చూస్తున్న వాళ్లంతా ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడి వచ్చినవాళ్లే. బయట వేరే రంగాల్లో కష్టపడుతూ ఇక్కడ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయినవాళ్లే. తాజాగా ఇద్దరు కమెడియన్స్ కూడా తమ కష్టాలను చెప్పుకున్నారు.

పటాస్ అనే టీవీ షోతో భాస్కర్, జ్ఞానేశ్వర్ ఇద్దరూ పరిచయం అయ్యారు. పటాస్ షో చూడటానికి వచ్చే స్టూడెంట్స్ గా వచ్చిన ఈ ఇద్దరూ తమ కామెడీ టైమింగ్ తో మెప్పించడంతో అక్కడ రచయితలు, దర్శకులు వీరిని గుర్తించి పటాస్ లో అవకాశం ఇచ్చారు. అప్పట్నుంచి ఇద్దరూ కలిసి తమ కామెడీతో మెప్పిస్తూ వస్తున్నారు. గల్లీ భాస్కర్, జ్ఞానేశ్వర్ పుట్ట అనే స్క్రీన్ పేర్లతో ఫేమస్ అయ్యారు. పటాస్, జబర్దస్త్.. తో పాటు అనేక టీవీ షోలలో కనిపించారు. సినిమాల్లో కూడా చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్నారు.

Also Read : Shreya Dhanwanthary : నాగచైతన్య ‘జోష్’ సెకండ్ హీరోయిన్ గుర్తుందా..? బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాలో తెలుగమ్మాయి రచ్చ..

ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి మాస్ జాతర అనే షో చేస్తున్నారు. ఇందులో కూడా ఇద్దరూ కలిసి స్కిట్స్ చేసి నవ్విస్తున్నారు. తాజా ఎపిసోడ్ లో.. వీరిద్దరూ కలిసి మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునేవాళ్లమని, ఇద్దరం కలిసే పనిచేసేవాళ్లమని, ఒకప్పుడు కూరగాయలు అమ్ముతూ ఇలా వచ్చామని తెలిపారు. మార్కెట్ లో కూరగాయలు అమ్మేవాళ్ళు ఎలా అరుస్తారో కూడా చేసి చూపించారు. అలా కూరగాయలు అమ్ముకుంటూ వచ్చిన ఛాన్స్ లు సద్వినియోగం చేసుకొని టీవీ లో స్టార్ కమెడియన్స్ గా ఎదిగిన వీరిని అంతా అభినందిస్తున్నారు.