Naga Chaitanya – Samantha : నాగ చైతన్యతో చేసిన సినిమా.. అది లేకపోతే ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు.. సమంత వ్యాఖ్యలు..
Samantha Ruth Prabhu: ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత నాగచైతన్యతో కలిసి నటించిన ఓ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Samantha On Naga Chatanya Ye Maya Chesave Movie
Samantha – Naga Chaitanya: సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా జూన్ 19న రిలీజ్ కానుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత నాగచైతన్యతో కలిసి నటించిన ఓ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్వ్యూలో తన పాత సినిమాలని కంపేర్ చేస్తూ అడగడంతో తన ఫేవరేట్ సినిమాలను చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఏ మాయ చేసావే – ఈగ అంటే ఏ మాయ చేసావే అని చెప్పింది. ఓ బేబీ – అఆ లో ఓ బేబీ చెప్పింది. యశోద – రంగస్థలంలో రంగస్థలం చెప్పింది. సిటాడెల్ – ఫ్యామిలీ మ్యాన్ లో ఫ్యామిలీ మ్యాన్ చెప్పింది. ఫ్యామిలీ మ్యాన్ – మా ఇంటి బంగారంలో మా ఇంటి బంగారం చెప్పింది. దీంతో చివర్లో మా ఇంటి బంగారం – ఏ మాయ చేసావే అడగ్గా ఏ మాయ చేసావే అని చెప్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Also See – Rashi Singh : ఎరుపు చీరలో రాశి సింగ్.. ఎంత క్యూట్ గా ఉందో.. ఫొటోలు వైరల్..
సమంత ఏ మాయ చేసావే సినిమా గురించి మాట్లాడుతూ.. ఏ మాయ చేసావే సినిమా లేకపోతే అసలు నేను లేను. అది నా ఫస్ట్ సినిమా. అది లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు అనిపించింది. ఒకవేళ నా ఫస్ట్ సినిమాకు బ్యాడ్ రెస్పాన్స్ వచ్చి ఉంటే నాకు అవకాశాలు వచ్చేవి కాదు దాని తర్వాత. అసలు దాంట్లో చర్చే అక్కర్లేదు ఏ మాయ చేసావే సినిమానే అని తెలిపింది.
ఏ మాయ చేసావే సమంతకు మొదటి సినిమా. అందులో హీరో నాగ చైతన్య. చైతూకి అది రెండో సినిమా. నాగ చైతన్య – సమంత కాంబోలో వచ్చిన మొదటి సినిమా ఏ మాయ చేసావే. ఇది మంచి లవ్ స్టోరీ సినిమాగా ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత వీరి కాంబోలో ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ సినిమాలు వచ్చాయి. ఏ మాయ చేసావే సినిమాతో పరిచయం అయిన ఈ ఇద్దరూ తర్వాత ప్రేమించుకొని పెళ్లి చేసుకొని అనంతరం విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైతు శోభితని సమంత రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకొని ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు.
Also See – Yukti Thareja : శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్.. ఫొటోలు..
View this post on Instagram
