Virata Parvam: విరాటపర్వం కోసం ఇద్దరు స్టార్ హీరోలు.. ఎవరంటే?
టాలీవుడ్‌లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టుల్లో విరాటపర్వం కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించగా, నక్సల్ నేపథ్యంలో సాగే ....
- Anil Aaleti
- Published On : June 13, 2022 / 09:28 PM IST
Two Star Heroes To Attend Virata Parvam Pre Release Special Event
Virata Parvam: టాలీవుడ్‌లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టుల్లో విరాటపర్వం కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించగా, నక్సల్ నేపథ్యంలో సాగే ఓ చక్కటి ప్రేమకథగా ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దాడు. ఇక ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రీసెంట్‌గా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుంది.
Virata Parvam : ఇది పాన్ ఇండియా సినిమా కాదు.. ముఖ్యంగా మహిళల సినిమా..
దీంతో ఈ సినిమాను జనంలోకి మరింతగా తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. రానా దగ్గుబాటి నక్సలైట్ పాత్రలో, అతడిని ప్రేమించే పల్లెటూరి అమ్మాయి వెన్నెల పాత్రలో సాయి పల్లవిలు తమ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాను జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
Virata Parvam: విరాటపర్వం రివ్యూ ఇచ్చిన నిఖిల్.. ఎలా ఉందంటే?
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రీరిలీజ్ ఈవెంట్‍ను స్పెషల్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్‌లోని ఇద్దరు స్టార్ హీరోలను ముఖ్య అతిథులుగా పిలవనున్నారట. వారు మరెవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్‌లు ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు రాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రానా దగ్గుబాటితో ఈ ఇద్దరికీ మంచి స్నేహం, బంధం ఉంది. అందుకే వారిద్దరినీ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించాలని రానా భావిస్తున్నాడట. విరాటపర్వం చిత్ర ప్రమోషన్స్ బాధ్యతను రానా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేయగా, సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.
