మలయాళంలో ఫాహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్.. ‘అథిరన్’ తెలుగులో ‘అనుకోని అతిథి’ (అంతకుమించి) పేరుతో నవంబర్ 15న రిలీజ్ అవుతోంది..
మలయాళంలో ఫాహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా వివేక్ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్.. ‘అథిరన్’ ఈ సినిమా తెలుగులో ‘అనుకోని అతిథి’ (అంతకుమించి) పేరుతో రిలీజ్ అవుతోంది. ఇన్‌ట్రూప్ ఫిల్మ్స్ సమర్పణలో జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై.. నిర్మాతలు అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు.
విభిన్న కథా, కథనాలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ.. రూపొందిన ఈ సినిమా 1972 కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్ధ కథ ఆధారంగా తెరకెక్కింది. రీసెంట్‌గా ‘అనుకోని అతిథి’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ టీమ్ క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ జారీ చేసింది. నవంబర్ 15న సినిమాను విడుదల చేయనున్నారు.
Read Also : ‘తెనాలి రామకృష్ణ BA.BL’ షూటింగ్ పూర్తి : నవంబర్ విడుదల
ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, రెంజి పానికర్, లియోనా లిషోయ్, శాంతికృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దక్షిణ్ శ్రీనివాస్, మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి, పాటలు: చరణ్ అర్జున్, మధు పడిమి కాల్వ, నేపథ్య సంగీతం: జిబ్రాన్, సంగీతం: పిఎస్ జయహరి.