Oppenheimer vs Barbie : ‘ఓపెన్‌హైమర్’ కాదు ‘బార్బీ’కే నా ఓటు అంటున్న బ్రిటన్ ప్రధాని రిషి సునక్..

హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ వారం మంచి పోటీ కనిపిస్తుంది. ఓపెన్‌హైమర్ మరియు బార్బీ చిత్రాలో ముందుగా ఏ సినిమాకి వెళ్లాలో అని ఆడియన్స్ తికమక పడుతున్నారు. అయితే బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తన ఓటు బార్బీకే వేశారు.

UK Prime Minister Rishi Sunak vote Barbie instead of Oppenheimer

Oppenheimer vs Barbie : ఈ వారం హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి పోటీ కనిపిస్తుంది. ఓపెన్‌హైమర్ మరియు బార్బీ చిత్రాలు ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యాయి. గ్రెటా గెర్విగ్ బార్బీకి దర్శకత్వం వహించగా, ఓపెన్‌హైమర్ ని క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలు పై ఇండియన్ ఆడియన్స్ పై మంచి ఆసక్తి ని చూపించారు. అయితే రెండు సినిమాల్లో ఏ సినిమాకి ముందు వెళ్ళాలి అనే ప్రశ్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఇబ్బంది పెడుతుంది. ఇక ఇదే సమస్య బ్రిటన్ (UK) ప్రధాని రిషి సునక్ (Rishi Sunak) ఎదురైంది.

Bholaa Shankar : భోళా శంకర్ ట్రైలర్‌కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిరంజీవి..

అయితే తన కుటుంబం ముందుగా బార్బీ చూడాలంటూ ఓటు వేయడంతో తన ఓటు కూడా ఆ మూవీకే వేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన సతీమణి అక్షతా మూర్తి మరియు వారి కుమార్తెలు కృష్ణ అండ్ అనౌష్కతో కలిసి థియేటర్లలో దిగిన ఫోటోని షేర్ చేస్తూ రిషి సునక్ ప్రేక్షకులకు తెలియయజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

Ram Charan : రామ్ చరణ్‌ మొదటి రెమ్యూనరేషన్‌తో ఏమి కొన్నాడో తెలుసా..? ఎక్కువుగా కొనేదేంటో తెలుసా..?

కాగా బార్బీ మూవీ ఐకానిక్ డాల్ గురించి అయితే.. నోలన్ యొక్క ఓపెన్‌హైమర్ అనేది అణు బాంబు తయారు చేసిన జె రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. అణు బాంబు తయారీకి మన మహాగ్రంధం మహాభారతం కారణం అని రాబర్ట్ ఓపెన్‌హైమర్ తెలియజేశారు. దీంతో ఈ మూవీ పై ఇండియాలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ నే అందుకుంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు