మరిచిపోలేని అనుభూతి : తలైవా రజనీ కాంత్

  • Publish Date - January 29, 2020 / 10:35 AM IST

డిస్కవరీ ఛానల్లో ప్రసారమయ్యే మ్యాన్ వెర్సెస్ వైల్డ్ షోలో తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్, బ్రిటన్ కు చెందిన సాహస వీరుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. డాక్యుమెంటరీలో నటించటం ఆనందంగా ఉందని .. మరిచిపోలేని అనుభూతిని ఇచ్చినందుకు ధన్యావాదాలు అని రజనీకాంత్ ట్వీట్ చేశారు.  

రజనీ కాంత్ బుధవారం రెండో రోజు షూటింగ్ లో పాల్గోన్నారు. మొదటి రోజు మంగళవారం కర్ణాటకలోని గుండ్లుపేట ఫారెస్ట్ లో షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్ సమయంలో స్వల్పంగా గాయపడ్డ రజనీ కాంత్ అడవి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. అయితే గాయం చిన్నదే కావటంతో వెంటనే కోలుకుని 2వరోజు షూటింగ్ లో పాల్గోన్నారు. డాక్యుమెంటరీ బృందంతో రజనీకాంత్ దిగిన ఫోటోలను బేర్ గ్రిల్స్  సోషల్ మీడియాలో పంచుకున్నారు.
  
మరోవైపు  గ్రిల్ కూడా తన ట్విట్టర్లో … గతంలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో మేం తీసిన ఎపిసోడ్ ను 3.6 మిలియన్ల మందిచూశారని…అది చరిత్ర సృష్టించిందని చెప్పారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీ కాంత్ తో కలిసి మరోషూట్ లో పాల్గోన్నామని… ఈ షోతో రజనీ టీవీ షోలో పాల్గోన్నారు. షూటింగ్  కొనసాగుతోందని వివరించారు.  కాగా డాక్యుమెంటరీ  చివరి రోజు షూటింగ్ లో  బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్  పాల్గోనున్నట్లు తెలిసింది.