Unstoppable with NBK : బాలకృష్ణ హోస్ట్ గా చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBk’ ఆహా ఓటీటీలో అంచనాలకు మించి అదరగొట్టింది. ఈ షో చుసిన తర్వాత అందరూ బాలయ్య అభిమానులు అయిపోయారు. ఈ షోలో వచ్చిన గెస్టులతో కలిసి ప్రేక్షకులని బాలకృష్ణ తనదైన శైలిలో ఎంటర్టైన్ చేశారు. ఇప్పటికే ఈ షో అనేక రికార్డులని సాధించింది. IMDBలో 9.8 టాప్ రేటింగ్ తో నంబర్ 1 పొజిషన్ లోకి కూడా వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
అయితే ఇటీవలే ఈ షో 10 ఎపిసోడ్స్ తో మొదటి సీజన్ పూర్తి చేశారు. త్వరలోనే రెండో సీజన్ కూడా ఉంటుంది అంటున్నారు. మరి రెండో సీజన్ లో కూడా హోస్ట్ గా బాలయ్య బాబునే తీసుకొస్తారా? లేక వేరే వాళ్ళని తీసుకొస్తారా అని లోచూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే అందర్నీ అలరించి, ఎన్నో రికార్డ్స్ సాధించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBk’ తాజగా మరో సరికొత్త రికార్డుని సాధించింది.
Ram Charan : మరో డైరెక్టర్ ఇచ్చిన కథతో శంకర్ RC 15..
40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలతో ఆహా ఓటీటీ ప్లాట్ఫాంలోనే అత్యధికంగా వీక్షించబడిన కార్యక్రమంగా ఈ షో నిలిచింది. 40 కోట్ల నిముషాలు అంటే ఏ రేంజ్ లో ఈ షో హిట్ అయిందో, ఎంతమంది ఈ షో ని చూసారో అర్ధమవుతుంది. బాలయ్యబాబు ఎక్కుడున్నా, ఏం చేసినా రికార్డులే అని మరోసారి రుజువైంది ఈ షోతో.
The love is UNSTOPPABLE ❤️#UnstoppableWithNBK is now the most-watched show on #ahavideoIN with 40 Crore Streaming Minutes ?
All Episodes Streaming Now
– https://t.co/02SRMUEzNu#NandamuriBalakrishna pic.twitter.com/yOpQTxJwqk— ahavideoIN (@ahavideoIN) February 8, 2022