Upasana excited in unseen clip
Upasana-Ram Charan : మెగా కుటుంబం, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణాలు ఈ నెల 20న ఆవిష్కృతం అయ్యాయి. టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిపుల్ అండ్ లవ్లీ కపుల్‌గా గుర్తింపు పొందిన రామ్‌చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు పెళ్లైన 11 ఏళ్లకు తల్లిదండ్రులు అయ్యారు. జూన్ 20న ఉపాసన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అభిమానులు, సెలబ్రిటీలు మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం పలుకుతూ నెట్టింట పోస్టులతో హోరెత్తించిన సంగతి తెలిసిందే.
కాగా.. డెలివరీకి ఒక రోజు ముందుగానే ఉపాసన ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. భర్త రామ్‌చరణ్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు అందరూ అక్కడే ఉన్నారు. ప్రసవం కోసం ఉపాసనను వీల్‌ఛైర్‌పై తీసుకువెలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం తన జీవితంలో చోటు చేసుకున్న అత్యంతమధురమైన క్షణాలు ఇవే.. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది.
Allu Sirish : ఇన్నాళ్లు దాచా.. నాలోని అభిమాని వల్ల ఇక కుదరలేదు
ఈ వీడియోలో ఉపాసనను వీల్‌చైర్‌పై తీసుకువెలుతుండగా చుట్టూ ఉన్న వారిలో ఒకరు.. ‘ఉప్సీ నీ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చాలా తక్కువ సార్లు మాత్రమే వాటిని చూశాము.’ అని అన్నారు. మరికాసేపట్లో తన బిడ్డను చూసుకోబోతున్న ఆనందంలో ఉపాసన ఉండడాన్ని గమనించవచ్చు. ఇక వీడియో చివరలో రామ్‌చరణ్‌ను ఆనందాన్ని కూడా చూడోచ్చు.
Ram Charan : వామ్మో.. కోటి రూపాయల వాచ్.. వైరల్ అవుతున్న రామ్ చరణ్ వాచ్.. అసలు ధర ఎంతో తెలుసా?
మరో ఫోటోను కూడా ఉపాసన ఇన్‌స్టాలో షేర్ చేసింది. మా చిట్టి తల్లికి లభించిన ఘన స్వాగతం ఎంతో అద్భుతంగా ఉంది. మాపై ప్రేమ, అభిమానం, ఆశిస్సులు చూపించిన అందరికి కృతజ్ఞతలు అని తెలిపింది. ఈ పిక్‌లో ఉపాసన పాపను ఎత్తుకుని కూర్చోగా రామ్‌చరణ్ తన పెంపుడు కుక్క రైమ్‌ని ఎత్తుకుని ఉన్నారు. వెనుక వెల్కమ్ హోమ్ బేబీ అని రాసి ఉండటాన్ని గమనించవచ్చు. చుట్టూ బెలూన్స్, ప్లవర్స్‌తో అందంగా డెకరేషన్ చేసి ఉంది.