Varun – Lavanya : ఈసారి చిరు కాదు ఉపాసన లీక్ చేసింది.. వరుణ్, లావణ్య పెళ్లి వేడుక అక్కడే..
వరుణ్ లావణ్య పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగబోతుంది అనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకుంది. తాజాగా పెళ్లి వేదిక ఎక్కడ అనేది బయట పడింది.
- gum 95921
- Published On : October 8, 2023 / 11:18 AM IST
Upasana leaks Varun Tej Lavanya Tripathi wedding venue
Varun Tej – Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లు ఎవరికీ తెలియకుండా ప్రేమించుకొని నిశ్చితార్థంతో అందరికి తెలియజేసిన వీరిద్దరూ.. ఇప్పుడు పెళ్లి జీవితాన్ని మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మెగా ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ శుక్రవారం రాత్రి మెగా ఫ్యామిలీ మెంబెర్స్ మధ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఇక ఈ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగబోతుంది అనే దానిపై ఆసక్తి నెలకుంది.
Also read : Varun Lavanya : వరుణ్ లావణ్య ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్ వీడియో చూశారా..? లీక్ చేసిన మెగా స్టార్
తాజాగా పెళ్లి వేదిక ఎక్కడ అనేది బయట పడింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ సతీమణి ఉపాసన లీక్ చేసింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘టుస్కానీ మేము వస్తున్నాము’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ వివాహానికి టుస్కానీ వేదిక కాబోతుందని అర్ధమవుతుంది. టుస్కానీ ఇటలీ దేశంలో ఉంది. త్వరలోనే మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడికి పయనం అవ్వనున్నట్లు తెలుస్తుంది. కాగా నిశ్చితార్థం వేడుక మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ మధ్యే జరిగింది. ఇప్పుడు పెళ్లి కూడా అలాగే జరగబోతుంది.
వరుణ్ అండ్ లావణ్య ఆరు సంవత్సరాల క్రితం మిస్టర్ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ఇద్దరు కలిసి మళ్ళీ అంతరిక్షం సినిమాలో కలిసి యాక్ట్ చేశారు. ప్రేమలో వరుణ్ తేజే ముందుగా ప్రపోజ్ చేశాడట. లావణ్య కూడా ఒకే చెప్పడంతో ఫామిలీస్ తెలియజేశారు. ఇరు కుటుంబసభ్యుల నుంచి అంగీకారం రావడంతో ఇప్పుడు ఏడడుగులు వేయబోతున్నారు.
