Upcoming Part 2 Movies
Part 2 Movies: అదే రెండు భాగాలుగా సినిమాలు. ఇది వరకు సినిమాలకు సీక్వెల్స్ మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా ప్రభాస్ మూవీ కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఇండస్ట్రీలో ‘బాహుబలి’ చాలా ట్రెండ్స్‌ను క్రియేట్ చేసింది. అందులో రెండు పార్ట్స్‌గా సినిమాను రిలీజ్ చేసే ట్రెండ్ కూడా ఉంది. ఆ సినిమా తరువాత పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న చాలా సినిమాలు రెండు భాగాలుగా రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంటున్నాయి. అది కూడా సినిమాతో పాటు అనౌన్స్ చేయకుండా షూటింగ్ దశలో మూవీ ఉండగా ప్రకటిస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో నటిస్తోన్న ‘సలార్’ మూవీని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా కథ, బడ్జెట్‌తో పాటు.. ప్రస్తుతం ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘సలార్’ ను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట మేకర్స్.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన సెన్సేషనల్ మూవీ ‘కె.జి.యఫ్’ కూడా రెండు బాగాలుగానే రిలీజ్ అవుతోంది. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన సెన్సేషన్‌తో ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ పై భారీ అంచనాలు ఉన్నాయి. కన్నడ యంగ్ స్టార్ యష్ నటించిన ఈ మూవీని సెప్టంబర్‌లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇదే ఫార్ములాను ప్రశాంత్, ‘సలార్’ కు కూడా అప్లై చేయాలని చూస్తున్నారట. అయితే ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు మూవీ టీమ్. అటు ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ రిజల్ట్‌ను బట్టి వీరి నిర్ణయం ఉండే అవకాశం ఉంది.
మరో వైపు అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ మూవీ కూడా రెండు పార్ట్స్‌గా రిలీజ్ కాబోతుంది. దాదాపు షూటింగ్ పూర్తి కావస్తున్న టైమ్‌లో ఈ విషయం బయటకు వచ్చింది. ‘పుష్ప’ కథను ఒక్క సినిమాతో చెప్పడం కష్టమని రెండు భాగాలుగా అయితే ఆడియెన్స్‌కు ‘పుష్ప’ స్టోరీని కరెక్ట్‌గా కన్వే చేయవచ్చు అనుకున్నారు సుకుమార్. అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఇంకా 20 రోజులు పెండింగ్ ఉంది. ఇప్పటి వరకు అఫీషయల్‌గా ఈ విషయాన్ని టీమ్ అనౌన్స్ చేయలేదు. ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌ను దసరాకు, సెకండ్ పార్ట్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం.