Yash Rangineni : ‘ఛాంపియన్’ సినిమాలో విజయ్ దేవరకొండ మామయ్య.. ఈ ప్రొడ్యూసర్ గురించి తెలుసా..?

విజయ్ దేవరకొండ మామయ్య యశ్ రంగినేని నిర్మాతగా తెలుగులో మంచి సినిమాలు తీశారు. (Yash Rangineni)

Yash Rangineni : ‘ఛాంపియన్’ సినిమాలో విజయ్ దేవరకొండ మామయ్య.. ఈ ప్రొడ్యూసర్ గురించి తెలుసా..?

Yash Rangineni

Updated On : December 31, 2025 / 8:46 PM IST

Yash Rangineni : విజయ్ దేవరకొండ మామయ్య యశ్ రంగినేని నిర్మాతగా తెలుగులో మంచి సినిమాలు తీశారు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌‌ స్థాపించి విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, ఆనంద్ దేవరకొండ తో దొరసాని సినిమాలు నిర్మించారు. అంతే కాక ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే.. లాంటి పలు సినిమాలను నిర్మించారు.(Yash Rangineni)

ఇన్నాళ్లు నిర్మాతగా సినిమాలు తీసిన యశ్ రంగినేని ఇప్పుడు నటుడిగా అదరగొట్టారు. ఇటీవల రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో నిజాం కాలంలో భైరాన్ పల్లిలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఛాంపియన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో యశ్ రంగినేని వీరయ్య అనే పాత్రలో నటించారు.

Also See : Dil Raju : దుబాయ్ లో దిల్ రాజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. భార్య, కొడుకుతో కలిసి..

భైరాన్ పల్లిలో పవర్ ఫుల్ ముసలి పాత్రలో యశ్ రంగినేని నటించాడు. అసలు సినిమా చూస్తే ఎవరూ గుర్తుపట్టలేనంతగా పాత్రలోకి మారిపోయి నటనతో, యాక్షన్ సీన్స్ తో మెప్పించారు. మొదటిసారి చేసినా నటుడిగా యశ్ రంగినేని మెప్పించడంతో విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆయన్ని అభినందిస్తున్నారు. మరి భవిష్యత్తులో కూడా ఇలాగే నటుడిగా సినిమాలు చేస్తారా? విజయ్, ఆనంద్ సినిమాల్లో కూడా నటిస్తాడా చూడాలి.

Vijay Deverakonda Uncle Yash Rangineni Turned as Actor in Champion Movie

Also Read : Nayanthara : నయనతార ‘టాక్సిక్’ లుక్.. మరోసారి స్టైలిష్ గా..